Constipation Relief: ఉదయం కడుపు క్లీన్ అవ్వట్లేదా?.. 5 నిమిషాల్లో పేగులన్నీ క్లీన్
ఉదయం పూట టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? తరచూ ఉబ్బరం, మలబద్ధకం లేక కడుపు భారంగా అనిపిస్తుందా? ఈ సమస్యలకు మీ ఆహారం, జీవనశైలి ప్రధాన కారణం కావచ్చు. ఆహారంలో ఫైబర్, నీరు తక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం వైద్యంలో కాకుండా, ఆహారంలో ఉంది. పచ్చి బొప్పాయి రైతా (Raw Papaya Raita) ఈ సమస్యకు అద్భుతమైన సహజ పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్ మన్ప్రీత్ ప్రకారం, ఈ సాధారణ భారతీయ వంటకం క్రమం తప్పకుండా తీసుకుంటే మీ జీర్ణ వ్యవస్థ అద్భుతంగా శుభ్రపడుతుంది.

ప్రతిరోజూ ఉదయం కడుపు తేలికగా లేకపోతే, మీ జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదనే అర్థం. డైటీషియన్ మన్ప్రీత్ పచ్చి బొప్పాయి రైతా పేగుల శుభ్రతకు సహజమైన మార్గం అంటున్నారు. ఇది మలబద్ధకం తగ్గించటమే కాదు, రోజు మొత్తం ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయి రైతా ఎలా పనిచేస్తుంది?
పాపైన్ ఎంజైమ్: పచ్చి బొప్పాయిలో పాపైన్ (Papain) అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది క్లిష్టమైన ఆహార కణాలను విచ్ఛిన్నం చేయటానికి, జీర్ణక్రియను సులభతరం చేయటానికి సహాయపడుతుంది.
ప్రోబయోటిక్ తో కలయిక: పాపైన్, సహజ ప్రోబయోటిక్ అయిన పెరుగు (Yogurt) తో కలిసినప్పుడు పేగుల ఆరోగ్యానికి శక్తివంతమైన కలయికగా మారుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ పాపైన్ ప్రయోజనాలను పెంచుతాయి. పేగుల సంపూర్ణ డిటాక్సిఫికేషన్‌కు సహాయపడతాయి.
పచ్చి బొప్పాయి రైతా ప్రధాన ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగు: పాపైన్ ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయిస్తుంది. ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ రాకుండా నివారిస్తుంది.
మలబద్ధకం నివారణ: పచ్చి బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. పేగుల్లోని విషాలు, వ్యర్థాలు తొలగి, జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉబ్బరం నివారణ: పెరుగులోని ప్రోబయోటిక్స్, బొప్పాయిలోని ఎంజైములు గ్యాస్ పేరుకుపోవటాన్ని నివారిస్తాయి.
శరీరాన్ని చల్లబరుస్తుంది: బొప్పాయి, పెరుగు రెండూ శరీరానికి చలువ చేస్తాయి. కడుపును ఉపశమనం చేస్తాయి.
రైతా తయారీ విధానం:
ఈ ఆరోగ్యకరమైన వంటకం చేయటానికి ఎక్కువ సమయం పట్టదు:
కావాల్సినవి:
చిన్న పచ్చి బొప్పాయి (తురుముకోవాలి)
ఒక కప్పు తాజా పెరుగు
½ టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి
చిటికెడు ఇంగువ
నల్ల ఉప్పు (రుచికి తగ్గట్టు)
తాజా పుదీనా ఆకులు (అవసరం అనుకుంటే)
తయారీ:
పచ్చి బొప్పాయిని తురిమి పక్కన ఉంచండి.
ఒక గిన్నెలో పెరుగు తీసుకుని మెత్తగా చిలకండి.
దానిలో వేయించిన జీలకర్ర, ఇంగువ, నల్ల ఉప్పు కలపాలి.
తురిమిన బొప్పాయిని కలిపి బాగా తిప్పండి.
పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా వడ్డించాలి.
ఈ రైతాను రోజూ ఒకసారి మధ్యాహ్నం భోజనంతో లేక రాత్రి భోజనంతో తింటే జీర్ణక్రియ గణనీయంగా మెరుగుపడుతుంది. కొన్ని వారాల్లోనే మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గి, కడుపు తేలికగా అనిపిస్తుంది.




