Chicken:: చికెన్‌ తిన్న తర్వాత ఇవీ తాగుతున్నారా? హెల్త్‌కు చాలా డేంజర్‌..

చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి..! చికెన్ వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి..కానీ వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు..వారమంతా చికెన్ లాగిస్తే ప్రమాదం. అయితే, చికెన్ తిన్న వెంటనే లేదా చికెన్‌తో పాటు తినకూడని ఫుడ్స్ చాలా ఉన్నాయి. అవేంటో చూడండి..

Chicken:: చికెన్‌ తిన్న తర్వాత ఇవీ తాగుతున్నారా? హెల్త్‌కు చాలా డేంజర్‌..
Don't Take This Drinks After Eating Chicken
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 29, 2024 | 1:14 PM

చాలా మంది చికెన్‌ను ఇష్టంగా తింటారు. కొంతమందికి చికెన్ లేనిదే ముద్దదిగదు. ఇక, ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదే లే అంటున్నారు. మద్యపాన ప్రియులు మంచింగ్‌కు చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఫారం కోళ్లను ఎక్కువగా తింటే అనర్థం తప్పదంటున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు. వారమంతా చికెన్ లాగిస్తే ప్రమాదం. అయితే, చికెన్ తిన్న వెంటనే లేదా చికెన్‌తో పాటు తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి ప్రమాదం. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్‌కు భిన్నంగా ఉంటుంది. పాలు, చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్‌ జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది జీర్ణప్రక్రయకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్‌ ఎక్కువకాలం తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి