AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా…ఇందులో నిజానిజాలు ఏంటో తెలుసుకుందాం..

భారతదేశంలో శాకాహారుల కంటే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో 78 శాతం మంది పురుషులు, 70 శాతం మంది స్త్రీలు మాంసాహారం తింటారు.

చికెన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా...ఇందులో నిజానిజాలు ఏంటో తెలుసుకుందాం..
Chicken
Madhavi
| Edited By: |

Updated on: Apr 30, 2023 | 9:30 AM

Share

భారతదేశంలో శాకాహారుల కంటే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో 78 శాతం మంది పురుషులు, 70 శాతం మంది స్త్రీలు మాంసాహారం తింటారు. మెజారిటీ ప్రజలు చికెన్ తింటారు. ఇందులో మటన్, బీఫ్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. ఇతర మాంసాలతో పోల్చితే చికెన్ ధర చాలా తక్కువ. అయితే చికెన్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తుంది దీని గురించి మనం తెలుసుకుందాం

నాన్ వెజ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?

రెడ్ మీట్‌లో ఉండే సంతృప్త కొవ్వు కారణంగా, కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి చాలా మంది డైటీషియన్లు చికెన్‌ను ఇతర నాన్-వెజ్ ఐటెమ్‌లతో పోల్చితే కాస్త ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. చికెన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి అనడంలో సందేహం లేదు, కానీ ఏదైనా ఎక్కువగా తినడం హానికరం, చికెన్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

చికెన్ మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఎక్కువగా తింటే హానికరంగా మారుతుంది. చికెన్ తో చేసే వంటల్లో మీరు ఎక్కువ నూనెను ఉపయోగించినట్లయితే, అది కొలెస్ట్రాల్‌ను మరింత పెంచుతుంది.

చికెన్‌లో లభించే పోషకాలు:

-ప్రోటీన్ – 27.07 గ్రాములు

– కొలెస్ట్రాల్ – 87 మి.గ్రా

– కొవ్వు – 13.5 గ్రాములు

– క్యాలరీలు- 237 మి.గ్రా

– కాల్షియం- 15 మి.గ్రా

– సోడియం 404 మి.గ్రా

– విటమిన్ ఎ – 160 మైక్రోగ్రాములు

– ఐరన్- 1.25 మి.గ్రా

-పొటాషియం- 221 మి.గ్రా

ఈ చికెన్ వంటకాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది:

మీరు చికెన్ తయారీలో ఎక్కువ వెన్న, నూనె లేదా ఏదైనా ఇతర కొవ్వును ఉపయోగిస్తే, అప్పుడు స్పష్టంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బటర్ చికెన్, చికెన్ ఫ్రై, కడాయి చికెన్, చికెన్ డీప్ ఫ్రై తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది

చికెన్ ఇలా వండుకుంటే కొలెస్ట్రాల్ మెయింటెయిన్ అవుతుంది:

చికెన్ తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగ కూడదని మీరు కోరుకుంటే, దీని కోసం మీరు చికెన్ సూప్, తక్కువ నూనెలో చేసిన చికెన్ తందూరీ, బొగ్గుపై వండిన చికెన్ కబాబ్‌లు వంటి కొన్ని ప్రత్యేక వంటకాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలన్నింటిలో వంటనూనె, వెన్న వాడకం చాలా తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి పెద్దగా హాని కలగదు.

అలాగే చికెన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారానికి ఒకరోజు మాత్రమే చికెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికంగా చికెన్ తింటే మాత్రం, మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. అలాగే డయాబెటిస్ తో బాధపడేవారు కూడా చికెన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మాంసాహారాన్ని మానివేస్తే మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం