AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnuts Uses: వాల్‌నట్స్‌తో జ్ఞాపక శక్తి మెరుగు.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు

వాల్‌నట్స్‌ను ప్రతిరోజూ తిన్నా, వారానికి మూడు రోజుల పాటు తిన్నా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బాలలు వాల్‌నట్స్ అధికంగా తింటే మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే కౌమారదశలో అభిజ్ఞా అభివృద్ధికి సాయం చేస్తుంది. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ ఫ్యాటీ యాసిడ్  పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఒమేగా 3 మెదడు అభివృద్ధిలో ప్రాథమిక పాత్ర పోషిస్తుంది.

Walnuts Uses: వాల్‌నట్స్‌తో జ్ఞాపక శక్తి మెరుగు.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
Walnuts
Nikhil
|

Updated on: Apr 28, 2023 | 6:00 PM

Share

ప్రపంచంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం దెబ్బకు ప్రజలు పౌష్టికాహారంపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పౌష్టికాహారాన్ని తింటున్నారు. పౌష్టికాహారంలో ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌ను వినియోగిస్తున్నారు. డ్రైఫ్రూట్స్‌లో ఎక్కువగా బాదం, వాల్‌నట్స్‌ను ఎక్కువగా తింటున్నారు. అయితే చిన్నపిల్లలు, యుక్త వయస్సు వచ్చిన వారు ఎక్కువగా వాల్‌నట్స్‌ తింటే వారికి జ్ఞాపక శక్తి మెరుగు అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. వాల్‌నట్స్‌ను ప్రతిరోజూ తిన్నా, వారానికి మూడు రోజుల పాటు తిన్నా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బాలలు వాల్‌నట్స్ అధికంగా తింటే మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే కౌమారదశలో అభిజ్ఞా అభివృద్ధికి సాయం చేస్తుంది. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ ఫ్యాటీ యాసిడ్  పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఒమేగా 3 మెదడు అభివృద్ధిలో ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. కౌమారదశ అనేది గొప్ప జీవసంబంధమైన మార్పుల కాలంగా వైద్యులు పరిగణిస్తారు. ఈ వయస్సులోనే హార్మోన్ల పరివర్తన సంభవిస్తుంది. ఇది ఫ్రంటల్ లోబ్ సినాప్టిక్ పెరుగుదలను ప్రేరేపించడానికి బాధ్యత వహిస్తుంది. మెదడులోని ఈ భాగం న్యూరోసైకలాజికల్ పరిపక్వతను అనుమతిస్తుంది. అలాగే కొవ్వు ఆమ్లాలతో బాగా పోషణ పొందిన న్యూరాన్లు పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త, బలమైన సినాప్సెస్‌ను ఏర్పరుస్తాయి. 

బార్సిలోనాలోని 12 వేర్వేరు ఉన్నత పాఠశాలల నుంచి 11 మరియు 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 700 మంది మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు  30 గ్రాముల వాల్‌నట్ కెర్నల్‌లను కలిగి ఉన్న సాచెట్‌లను ఆరు నెలల పాటు అందించారు. ఇలా చేయడం ద్వారా ఆ విద్యార్థుల్లో శ్రద్ధ, పనితీరును పెంచుకున్నారు. అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి లక్షణాలు ఉన్నవారు వారి ప్రవర్తనను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు. అలాగే తరగతి గదిలో గురువు చెప్పే దానిపై ఎక్కువ శ్రద్ధ కనబరిచి, తక్కువ హైపర్యాక్టివ్‌గా ఉన్నారని తేలింది. అలాగే వారి న్యూరోసైకోలాజికల్ ఫంక్షన్‌లలో మెరుగుదల కనిపించిందని వైద్యులు తేల్చారు. ముఖ్యంగా కౌమారదశలో ఉన్నవారు అభిజ్ఞా, మానసిక స్థాయిలో సరిగ్గా అభివృద్ధి చెందడానికి వాల్‌నట్స్ తినడం ఉత్తమమని పరిశోధకులు తేల్చారు.

బాలురు, బాలికలు ఈ సిఫార్సులను పాటించి రోజుకు కొన్ని వాల్‌నట్‌లను లేదా వారానికి కనీసం మూడు సార్లు తింటే, వారు అభిజ్ఞా సామర్థ్యాలలో అనేక గణనీయమైన మెరుగుదలలను గమనించవచ్చు. అలాగే యుక్తవయస్సు వారు సవాళ్లను ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. కౌమారదశ అనేది గొప్ప మెదడు అభివృద్ధి మరియు సంక్లిష్టమైన ప్రవర్తనల కాలం, దీనికి గణనీయమైన శక్తి మరియు పోషకాలు అవసరమవుతాయి కాబట్టి వాల్‌నట్స్ తినడం ఉత్తమమని పరిశోధనలో పాల్గొన్న పరిశోధకులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..