AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Washing Tips: కారు వాష్ కోసం వాషింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారా.. ఇలా చేస్తే బోలెడు డబ్బు ఆదా చేయొచ్చు..

డబ్బు ఆదా చేయడానికి మీ కారును ఇంట్లోనే కడగడం ఉత్తమం. ఇందు కోసం ఈ సులభమైన పద్ధతులను అనుసరించండి. దీని తర్వాత, మీ వేల రూపాయల ఖర్చు ఆదా చేసుకోవచ్చు.

Car Washing Tips: కారు వాష్ కోసం వాషింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారా.. ఇలా చేస్తే బోలెడు డబ్బు ఆదా చేయొచ్చు..
Car Wash
Sanjay Kasula
|

Updated on: Apr 28, 2023 | 5:58 PM

Share

తమ వాహనాన్ని తమ కంటే ఎక్కువగా చూసుకుంటారు. అప్పుడప్పుడు సర్వీసింగ్ కోసం తీసుకెళ్లడమే కాకుండా.. తమ కారును క్లీన్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.. అంతెందుకు కనీసం బయట కూడా సర్వీసింగ్ చేయంచరు.. ప్రత్యేకించి షోరూం తీసుకెళ్లి అక్కడే జాగ్రత్తగా చేపిస్తారు. చిన్న వాషింగ్స్ కూడా అక్కడే చేస్తుంటారు. వీటన్నింటిని పూర్తి చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మీరు వాహనం మెయింటెనెన్స్ వేల రూపాయలు ఆదా చేయాలనుకుంటే.. ఈ చిట్కాలను అనుసరించండి. దీని తర్వాత, మీరు మీ వాహనం నిర్వహణ ఖర్చును సగానికి సగతం తగ్గించుకుంటారు.

వాహనం మెయింటెనెన్స్ ఖర్చును ఆదా చేయడానికి.. మీరు మీ వాహనాన్ని ఇంట్లోనే కడగవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు వాహనాన్నివాషింగ్‌కు సరైన పద్దతిలో  తెలుసుకోవాలి. దీని కోసం, ఇంట్లో కారును ఎలా కడగవచ్చో ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుందాం.

షాంపూ ఉపయోగించండి

కారును కడగడానికి సర్ఫ్‌తో పోలిస్తే షాంపూని ఉపయోగించడం ప్రయోజనకరం. షాంపూతో కారును శుభ్రం చేయడం ద్వారా మీ కారు మునుపటిలా మెరుస్తుంది. దీని కోసం, మీరు నీటిలో కొంచెం షాంపూ కలపాలి.. ఆ తర్వాత కారును కడగాలి. కారును వాష్ చేసిన తర్వాత తుడవడానికి కాటన్ క్లాత్‌‌ను మాత్రమే ఉపయోగించండి.

అద్దాలను శుభ్రం చేయడానికి..

కారు గ్లాస్‌ను శుభ్రం చేయడానికి మీరు న్యూస్ పేపర్‌ని ఉపయోగించాలి. దాని కారణంగా కారు గ్లాస్ మెరుస్తుంది. తడి వార్తాపత్రికను కాకుండా పొడి వార్తాపత్రికను ఉపయోగించండి. డ్రై పేపర్‌తో కారు గ్లాస్‌ని శుభ్రం చేయండి.

లోపలి నుంచి కారును శుభ్రం చేయండి

మీరు మీ కారును లోపల, వెలుపల నుంచి శుభ్రం చేస్తే.. మీ కారు కొత్తదిగా కనిపిస్తుంది. దీని కోసం, కారు సీటు, లెగ్‌స్పేస్, స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్, ఎయిర్ కండీషనర్ శుభ్రం చేయడం మర్చిపోవద్దు. దీని కోసం, పొడి కాటన్ వస్త్రాన్ని ఉపయోగించండి. వాహనం ప్రతి భాగం నుంచి పేరుకుపోయిన దుమ్మును తొలగించండి. వాషింగ్ చేస్తున్నప్పుడు కారును నీడలో మాత్రమే పార్క్ చేయడం.. ఎండలో కారు పార్క్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుందని గుర్తుంచుకోండి.

ఎంత ప్రెజర్ వాటర్ ఉపయోగించాలంటే..

వాషింగ్ చేస్తున్నప్పుడు ప్రెజర్ వాషర్, శుభ్రమైన నీటితో కారును కడగాలి. ఎల్లప్పుడూ ఫ్లాట్ జెట్ నాజిల్‌తో పని చేయండి. కారు ఉపరితలం నుంచి 15-సెంటీమీటర్ల దూరం లేదా టైర్ల నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉండండి. ప్రత్యామ్నాయంగా..మృదువైన వాష్ బ్రష్ , పవర్ బ్రష్ లేదా తిరిగే వాష్ బ్రష్ ప్రెజర్ వాషర్‌కు ఉపయోగించండి. ఇది చెత్తను మరింత క్షుణ్ణంగా తొలగిస్తుంది. ఎల్లప్పుడూ కారును కింది నుండి పైకి కడగాలి. ఇది ఇంకా ఏయే ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందో చూడటం సులభం చేస్తుంది.

పక్షి రెట్టలు తొలిగించేందుకు..

కారుపై పడిన పక్షి రెట్టలను తొలగించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. పక్షి రెట్టలను ముఖ్యంగా వేసవి నెలల్లో క్లీన్ చేస్తున్నప్పుడు పెయింట్‌ను దెబ్బతింటుంది. వాటిని తీసివేయడానికి కొంత సమయంపాటు నీటితో నాన బెట్టండి. ఎండి రెట్టలను తొలిగించేప్పపుడు జాగ్రత్తలు తీసుకోకుంటే కారుపై గీతలు పడవచ్చు. బదులుగా, ప్రెజర్ వాషర్‌తో లేదా కార్ వాష్‌లో కారును కడగడానికి ముందు గోరువెచ్చని నీరు మరియు కిచెన్ టవల్ ఉపయోగించి ప్రభావిత ప్రాంతాన్ని నానబెట్టండి . మలాన్ని మెత్తటి స్పాంజితో లేదా తడి గుడ్డతో సులభంగా తుడిచివేయవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం