Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. వెరీ డేంజర్‌.. ఆ లోపం ఉన్నట్లే..

మెగ్నీషియం అనే పదం కెమిస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. మెగ్నీషియం రసాయన చిహ్నం Mg పరమాణు సంఖ్య 12. మానవ శరీరంలో దీని పాత్ర ఏంటి.. మెగ్నీషియం అనేది శరీరంలోని 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ ప్రతిచర్యలలో పాల్గొనే ముఖ్యమైన మూలకం. చిన్న ప్రేగులలో ఆహార పోషకాలను గ్రహించడంలో మెగ్నీషియం..

Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. వెరీ డేంజర్‌.. ఆ లోపం ఉన్నట్లే..
Know The Common Signs And Symptoms Of Magnesium Deficiency
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 08, 2023 | 4:59 AM

మెగ్నీషియం అనే పదం కెమిస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. మెగ్నీషియం రసాయన చిహ్నం Mg పరమాణు సంఖ్య 12. మానవ శరీరంలో దీని పాత్ర ఏంటి.. మెగ్నీషియం అనేది శరీరంలోని 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ ప్రతిచర్యలలో పాల్గొనే ముఖ్యమైన మూలకం. చిన్న ప్రేగులలో ఆహార పోషకాలను గ్రహించడంలో మెగ్నీషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మూత్రపిండాలు చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యవంతమైన మానవ శరీరానికి రోజుకు 300 గ్రాముల మెగ్నీషియం అవసరమని, దాని లోపం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఉందని ఎలా తెలుస్తుంది. లక్షణాలు ఏంటి తెలుసుకుందాం.

1. అలసట, బలహీనత

మీరు అన్ని వేళలా అలసిపోయినట్లు, బలహీనంగా ఉన్నట్లయితే ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం. కడుపులో ఎల్లప్పుడూ బరువుగా ఉన్న భావన ఉంటే అది మెగ్నీషియం లోపం వల్ల కావచ్చు.

2. వికారం

చిన్న పేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో, అవసరమైన పోషకాలను గ్రహించడంలో మెగ్నీషియం పాత్ర ముఖ్యమైనది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే మీ ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహారం తిన్న తర్వాత వికారం, వాంతులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

3. కండరాల తిమ్మిరి, నొప్పి

శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కీళ్ళు, కండరాలలో నొప్పి అనుభూతి ఉంటుంది. ఎక్కువసేపు నిలబడటం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయడం వల్ల అలసట వస్తుంది.

4. బోలు ఎముకల వ్యాధి

బోలు ఎముకల వ్యాధికి ప్రధాన కారణాలలో మెగ్నీషియం లేకపోవడమే.

5. రెండో రకం మధుమేహం

టైప్ 2 డయాబెటిస్ ప్రమాదకరమైన వ్యాధి. మెగ్నీషియం లోపం వల్ల ఇది వస్తుంది. ఈ లోపం ఆహారం, విటమిన్ సప్లిమెంటేషన్ ద్వారా కవర్‌ చేయవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..