Health Tips: పెరుగును వీటితో కలిపి తింటున్నారా?.. ఇక మీ పని అయిపోయినట్టే!
చాలా మంది తినే ప్రతి పదార్థంలో తెరుగును కలుపుకొని తింటుంటారు. కానీ ఇలా తినడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా? పెరుగును ఈ పదార్థాలతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థలో చాలా మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగును వేటితో కలిపి తినకూడదో తెలుసుకుందాం పదండి.

పెరుగు.. ఇది అందరి ఫేవరెట్. ఎంత తిన్నా చివరి ముద్ద పెరుగుతో తింటేనే భోజనం చేసిన సంతృప్తిని కలుగుతుంది. అది మరి పెరుగు ప్రత్యేకత. వేసవి కాలంలో వాతావరణంలోని ఉండే వేడి వల్ల మన బాడీలోని నీటి శాతం తొందరగా తగ్గి పోతుంది. దీంతో మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇలా మన శరీరం డీహైడ్రేటెడ్ కాకుండా ఉంచుకోవడం కోసం పెరుగును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో జీర్ణక్రియను మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలను బలోపేతం చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా పెరుగు బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఇదంతా బాగానే ఉంది..కానీ పెరుగును అన్నింటితో కలిపి తీసుకోవచ్చా అంటే కాదనే చెబుతున్నారు వైద్యులు. పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో మాత్రమే కలిపి తెనొచ్చు అంటున్నారు. అవేంటో ఒక లుక్కేదామా.
చాలా మంది పెరుగును పండ్లతో కలిపి తింటారు, ముఖ్యంగా నారింజ, పైనాపిల్, కివి, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో పెరుగును కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, పండ్లతో పెరుగు తినడం వల్ల శరీరంలో అధిక ఆమ్లత్వం ఏర్పడి, జీర్ణ వ్యవస్థలో సమస్యలు మొదలవుతున్నాయని అంటున్నారు. వీటితో పాటు బరువు పెరగడం, గ్యాస్ ఫామ్ అవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా పెరుగుతో పాటు స్పైసీ ఫుడ్‌ను కూడా చాలా మంది తింటుంటారు. ఇది కూడా మన ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు. స్పైసీ ఫుడ్ కడుపులో వేడిని కలిగిస్తే..పెరుగు దాన్ని చల్లారుస్తుందని..ఇలాంటి ప్రిక్రియ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని తెలుస్తోంది. పెరుగును చేపలతో కలిపి తినడం కూడా జీర్ణవ్యవస్థలో సమస్యలు ఏర్పడడానికి కారణం అవుతుందని..కాబట్టి పెరుగును చేపలతో కలిపి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా గుడ్లు, టమాటోలను కూడా పెరుగుతో కలిపి తీసుకోవద్దు అంటున్నారు. వీటి కలయిక జీర్ణ ప్రక్రియలో అసమతుల్యతను సృష్టిస్తోందని, అజీర్ణం వంటి సమస్యలకు దారితీయడంతో పాటు చర్మంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)