ఉదయాన్నే ఇవి తీసుకోండి.. మీ కిడ్నీలు పది కాలాల పాటు హెల్తీగా ఉంటాయి..!
శరీరంలో ఉన్న మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో మార్పులు అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే కొన్ని సహజ డ్రింక్ లను తీసుకోవడం ద్వారా కిడ్నీలను శుభ్రంగా ఉంచవచ్చు. ఇప్పుడు వేసవి కాలంలో ఈ డ్రింక్ లు మరింత ఉపయోగపడతాయి.

మానవ శరీరంలో కిడ్నీలు కీలకమైన అవయవాలు. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను వడపట్టి, మూత్ర రూపంలో బయటకు పంపే కీలక బాధ్యతను నిర్వహిస్తాయి. కాబట్టి వాటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఉదయాన్నే కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్ లను తీసుకోవడం ద్వారా మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు. వేసవిలో శరీరానికి తేమ అందించడంలో, డీటాక్సిఫికేషన్ లో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అలాంటి డ్రింక్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా అల్లం ముక్కలతో ఉడకబెట్టి తయారయ్యే అల్లం టీ అనేది మూత్రపిండాలకు మేలు చేసే సహజమైన డ్రింక్. ఇందులో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మూత్రపిండాల్లో ఉండే వాపును తగ్గిస్తాయి. అలాగే ఇది టాక్సిన్లను బయటకు పంపే ప్రక్రియకు వేగవంతం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.
నిమ్మరసం కలిపిన నీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇది శరీరంలోని హానికర పదార్థాలను శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ చల్లని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరం ఫ్రెష్ గా ఉంటుంది.
గ్రీన్ టీలో ఉండే కెటచిన్స్, పాలీఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రపిండాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
చిన్న మోతాదులో యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించవచ్చు. ఇది శరీరంలోని పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
తాజా కొబ్బరి నీళ్లు శరీరానికి తేమను అందించడంలో కీలకంగా ఉంటాయి. ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్స్ మూత్రపిండాలపై వచ్చే ఒత్తిడిని తగ్గిస్తాయి. వేసవిలో ఈ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
బార్లీ విత్తనాలను ఉడికించి వడకట్టి తాయారు చేసే ఈ నీరు మూత్రపిండాల నుండి టాక్సిన్లను బయటకు పంపే శక్తిని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
క్రాన్బెర్రీ పండ్లలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి ఇది ఒక మంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
తులసి ఆకులతో తయారయ్యే తులసి నీళ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఇవి బాగా సహాయపడతాయి. మూత్రపిండాలతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
ఈ డ్రింక్ లు అన్నింటి కంటే కూడా వాటర్ తాగడం చాలా అవసరం. రోజూ కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. వేసవిలో ఇది మరింత అవసరం.
ఈ డ్రింక్ లను ఉదయాన్నే అలవాటు చేసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇవి సహజ పదార్థాలతో తయారవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు డ్రింక్‌లను తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తిని, కిడ్నీలకు రక్షణను అందించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)