One Side Headache: వన్ సైడ్ తలనొప్పి ఎక్కువగా వస్తుందా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
సాధారణంగా తలనొప్పి వస్తానే చాలా చికాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. తల నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం, ఆహారం లేదా నీరు తీసుకోకపోవడం, చికాకుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, మనకు నచ్చని పని చేసినప్పుడు, టెన్షన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, గాయాల కారణంగా ఇలా ఒక్కటేంటి.. చాలా రకాలు ఉంటాయి. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కానీ కొంత మందికి వన్ సైడ్ మాత్రమే ఎక్కువగా తల నొప్పి..

సాధారణంగా తలనొప్పి వస్తానే చాలా చికాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. తల నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం, ఆహారం లేదా నీరు తీసుకోకపోవడం, చికాకుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, మనకు నచ్చని పని చేసినప్పుడు, టెన్షన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, గాయాల కారణంగా ఇలా ఒక్కటేంటి.. చాలా రకాలు ఉంటాయి. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కానీ కొంత మందికి వన్ సైడ్ మాత్రమే ఎక్కువగా తల నొప్పి వస్తుంది. దీంతో ఇంకా చికాకుగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. మరి ఈ వన్ సైడ్ తల నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? వన్ సైడ్ మాత్రమే ఎందుకు తలనొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ సైడ్ తలనొప్పి లక్షణాలు..
వన్ సైడ్ ఎక్కువగా వచ్చే తల నొప్పిని ‘టెన్షన్ తలనొప్పి’ లేదా ‘మైగ్రేన్’ అని పిలుస్తూంటారు నిపుణులు. ఈ తల నొప్పి వచ్చిందంటే 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఇది అకస్మాత్తుగా ఎటాక్ చేస్తుంది. వికారంగా, వాంతులు అవ్వడం, ఒక కంటి నుంచి కన్నీళ్లు రావడం ఇలా కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంది. ఇది వచ్చిందంటే ఒక పట్టాన కూర్చోవడానికి, నిల్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
ఎందుకు వస్తుంది..
ఈ వన్ సైడ్ తల నొప్పి రావడానికి.. ముఖ్యంగా ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా తీసుకోవడం, ఆవేశానికి ఎక్కువగా గురి కావడం, కూర్చునే విధానంలో మార్పులు, నడవడం, నిద్ర పోవడం, తలను తప్పుడు భంగిమల్లో ఉంచడం వల్ల కూడా కండరాలు ఓవర్ లోడ్ అయి టెన్షన్ వస్తుంది. దీంతో ఒక వైపు తల నొప్పి వస్తూ ఉంటుంది.
దీనికి పరిష్కారం ఏంటంటే..
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. తరచూ వ్యాయామం తప్పకుండా చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకుండా.. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర కూడా ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు సాఫ్ట్ గా ఉండే దిండును ఉపయోగించాలి. దీంతో మీ తల, మెడ కండరాలు రిలాక్స్ అయి.. వన్ సైడ్ నొప్పి రాకుండా ఉంటుంది. అదే విధంగా డెస్క్ జాబ్స్ చేసే వారు గంటకు ఒకసారైనా కళ్లకు రెస్ట్ ఇవ్వడం మంచిది. కళ్లపై పెరిగిన ఒత్తిడి కారణంగా కూడా వన్ సైడ్ తల నొప్పి అనేది వస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








