Health Tips: అనారోగ్యంగా ఉన్నప్పుడు పాలు తాగుతున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!!
అప్పుడప్పుడు ఎవరైనా సరే అనారోగ్యం బారిన పడుతూంటారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇలా అన్నీ ఒక్కటే సారి కలిపి ఎటాక్ చేస్తాయి. దీంతో నీరసించి పోతారు. ఏమీ తినాలని పించదు.. తాగాలని పించదు. జ్వరం వంటివి వచ్చినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు కూడా చెబుతూంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు నీరసంగా ఉంటుందని.. పాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా జ్వరం వచ్చినప్పుడు పాలు తాగొచ్చా..

అప్పుడప్పుడు ఎవరైనా సరే అనారోగ్యం బారిన పడుతూంటారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇలా అన్నీ ఒక్కటే సారి కలిపి ఎటాక్ చేస్తాయి. దీంతో నీరసించి పోతారు. ఏమీ తినాలని పించదు.. తాగాలని పించదు. జ్వరం వంటివి వచ్చినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు కూడా చెబుతూంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు నీరసంగా ఉంటుందని.. పాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా జ్వరం వచ్చినప్పుడు పాలు తాగొచ్చా.. అనారోగ్యంగా ఉన్నప్పుడు పాలు తాగితే తొందరగా అరగవని మరికొందరు చెబుతూంటారు. ఇందులో నిజం ఎంత ఉందో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలతో అనేక ప్రయోజనాలు:
పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు, కేలరీలు, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఎముకలు, పళ్లు, కండరాలు బలంగా ఉండాలంటే పాలు చాలా అవసరం. ఆరోగ్య వంతంగా ఎదిగేందుకు కూడా పాలు చాలా అవసరం. పాలు తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది పాలు.
అనారోగ్య సమయంలో పాలు తాగడం మంచిదేనా?
అయితే పాలు ఎంత మంచివైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగితే త్వరగా అరగవు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోం. దీంతో అలసట, నీరసంగా ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ కూడా చాలా నెమ్మదిగా పని చేస్తుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు తేలికమైన ఆహారాలను తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తారు. కానీ పాలు తాగితే బలం వస్తుందని.. తాగుతూంటారు. ఈ సమయంలో పాలు తాగితే త్వరగా జీర్ణం కావు.
పాలు త్వరగా జీర్ణం కావు:
పాలలో లాక్టియం అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది అంత త్వరగా జీర్ణం కాదు. దీంతో అనేక సమస్యలు ఎదురవుతాయి. చెమటలు పట్టడం, డీ హైడ్రేషన్ కు గురవ్వడం జరుగుతాయి. మరికొందరికి వికారం, వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్యం ఉన్నప్పుడు పాలుకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. టీ గ్లాస్ పరిమాణంలో తాగితే పర్వాలేదు కానీ.. ఎక్కువ మొత్తంలో మాత్రం పాలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయట.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.