Aloe vera Side Effects: ఆరోగ్యం కోసం అలోవెరా జ్యూస్‌ని ఎక్కువగా తాగేస్తున్నారా? ఒక్కసారి ఇది తెలుసుకోండి.. లేదంటే..
Aloe vera Side Effects: అలోవెరా ఔషధ రంగంలో 'అద్భుత మొక్క'గా పరిగణించబడుతుంది. ఆరోగ్యం, అందం, చర్మ సంరక్షణ అవసరాలకు..
Aloe vera Side Effects: అలోవెరా ఔషధ రంగంలో ‘అద్భుత మొక్క’గా పరిగణించబడుతుంది. ఆరోగ్యం, అందం, చర్మ సంరక్షణ అవసరాలకు ఇది అమృతంలా పోలుస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ప్రస్తుత కరోనా కాలంలో కలబంద రసానికి ‘పర్ఫెక్ట్ హెల్త్ డ్రింక్’గా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది నిజంగా ఫర్ఫెక్ట్ హెల్త్ డ్రింకేనా? అలోవెరా జ్యూస్ వల్ల ఏం దుష్ప్రభావాలు లేవా? అంటే దుష్ప్రభావాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి కలబంద వల్ల కలిగే దుష్పభ్రావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కలబంద జ్యూస్ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు.. 1. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం: మీరు కలబంద జ్యూస్ తీసుకోవడం ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. ఒకసారి వైద్యులను సంప్రదించి ఈ జ్యూస్ తాగడం ఉత్తమం.
2. డీహైడ్రేషన్ పెరిగే ఛాన్స్: ప్రతి రోజూ అలోవెరా జ్యూస్ తాగుతున్నట్లయితే.. కాస్త తగ్గించడం మంచిది. ఎందుకంటే.. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. తద్వారా డీహైడ్రేషన్ సమస్యకు కారణం అవుతుంది. ఫలితంగా మూత్రం రంగులో మార్పు వస్తుంది.
3. అతిసారం: కలబంద.. భేదిమందు లక్షణాలను కలిగి ఉన్నందున ఇది మీ ప్రేగుల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
4. ఆకస్మిక అలసట: కలబంద శరీరంలోని పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఆకస్మిక తలనొప్పికి దారితీస్తుంది. అసాధారణ హృదయ స్పందన, కండరాల తిమ్మిరి సహా మరికొన్ని సమస్యలకు కూడా దారి తీయవచ్చు.
కలబందను ఎంత మోతాదులో తీసుకోవాలి? ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ స్టాండర్డ్ ప్రకారం.. అలోయిన్ కంటెంట్ 10ppm(పార్ట్స్ పర్ మిలియన్) కంటే తక్కువగా ఉండాలని, వైద్యేతర ఉపయోగం కోసం 50ppm లేదా అంతకంటే తక్కువగా ఉండాలని సూచించింది. తక్కువ వ్యవధిలో కలబంధను చిన్న మోతాదులో తీసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కలబందను తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలివే.. గర్భాశయ సంకోచాల ఉద్దీపన కారణంగా గర్భధారణ సమయంలో నోటిద్వారా కలబందను తీసుకోకూడదు. పాలిచ్చే తల్లులు ఈ జ్యూస్ తాగడం వల్ల శిశువుల్లో జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
Also read:
Healthy Heart Tips: “ఆమె”నే వెంటాడుతున్న గుండె నొప్పి.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..
Women’s Day 2022: తెలంగాణ మణిహారం మల్లన్న సాగరం.. ఈ ప్రాజెక్టులో మరిచిపోలేని ‘ఆమె’ కృషి..