Anasuya Bharadwaj: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ తాజా ట్వీట్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..

యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఈ యాంకరమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Anasuya Bharadwaj: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ తాజా ట్వీట్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 08, 2022 | 6:24 PM

యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఈ యాంకరమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో నటనపరంగా ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటించి మెప్పించింది. ఓవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే.. మరోవైపు… వెండితెరపై సత్తా చాటుతోంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్.. ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అనసూయకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.. ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రతి విషయంలోనూ ఆమెను ట్రోల్ చేస్తుంటారు నెటిజన్స్. ఇక తను ట్రోల్ చేసేవారికి తనదైన స్టైల్లో గట్టిగానే కౌంటర్ ఇస్తుంది అనసూయ. తాజాగా ఉమెన్స్ డే పై అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

” ఓ సడెన్ గా ఈరోజు ట్రోలర్స్, మీమ్ మేకర్స్ అందరూ కూడా మహిళలను గౌరవిస్తున్నారు. ఇది 24 గంటల్లోనే ముగుస్తుందని తెలుసు. అందుకే మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది అనసూయ. ఇంకెముందీ… అనసూయ చేసిన ట్వీట్ తో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. మథర్ థెరిస్సా.. మెరీ కోమ్ వంటి వారిపై ఎవరు ట్రోల్ చేయరు. మనం చేసే పనుల ద్వారానే మనకు గౌరవం దక్కుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన గురించి వస్తున్న కామెంట్స్ చూసిన అనసూయ.. మరోసారి ట్రోల్స్ చేసేవారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గుమ్మడి కాయ దొంగలు వచ్చారు. నా ట్వీట్ కింద్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు చూడండి అంటూ మరో ట్వీట్ చేసింది అనసూయ.

అయితే తాజాగా ఆమె చేసిన మరో ట్వీట్ పై కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ తెరపై కనిపించే విధానం.. మాటలను గుర్తుచేస్తున్నారు. బుల్లితెరపై చేసే షోలలో మహిళలపై కామెంట్స్ చేస్తే నవ్వుతుంటారు.. కానీ ఇప్పుడు ఎందుకు గుర్తురావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తన గురించి కామెంట్స్ చేసే వారిని అనసూయ బ్లాక్ చేస్తూ వస్తోంది. దీంతో అనసూయ బ్లాక్ చేస్తుంది అంటూ మళ్లీ కామెంట్స్ మొదలుపెట్టారు. మొత్తానికి అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద రచ్చే జరుగుతుంది.

Also Read: Chiranjeevi: నేను హీరోగా నిలదొక్కుకున్నానంటే ఆమే కారణం.. మహిళా దినోత్సవంలో మెగాస్టార్‌ చిరంజీవి.

Naseeruddin Shah: నేను ఆ మానసిక సమస్యతో బాధపడుతున్నా.. ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదంటోన్న నసీరుద్దీన్ షా..

Trivikram Srinivas: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గురూజీ.. ఎన్ని సినిమాలు లైనప్ చేశారో తెలుసా..

Dulquer Salmaan: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..