Dulquer Salmaan: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం

Dulquer Salmaan: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Dulquer Salmaan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 08, 2022 | 9:12 AM

Dulquer Salmaan: మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు దుల్కర్. ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంది విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్. ఈ సినిమాలో శివాజీ గణేష్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు దుల్కర్. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడు.మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారిగా దుల్కర్ ప్రేమ కోసం ఎలా పోరాడాడు అని నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘హే సినామిక’ అనే సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఇదిలా ఉంటే దుల్కర్ నటించిన తాజా చిత్రం ఒకటి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ హీరోగా సెల్యూట్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ట్రైలర్‌తో మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ మూవీలో దుల్కర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రోషన్‌ ఆండ్రూస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డయానా పెంటీ, లక్ష్మీ గోపాలస్వామి, సానియా అయ్యప్పన్, మనోజ్ కె జయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీని ఈనెల 18న సోనీ లైవ్లో  నేరుగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ జీవోపై స్పందించిన చిరంజీవి.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్..

AP Movie Ticket Price: సినిమా టికెట్ల రేట్స్ నిర్ణయించిన ఏపీ సర్కార్.. ధరల వివరాలు ఇక్కడ చూడండి..

రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం గుడ్‏న్యూస్.. సినిమా టికెట్స్ రేట్స్ జీవో జారీ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!