AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: కండోమ్‌ టెస్టర్‌గా రకుల్‌.. ఆమె తల్లిదండ్రులు రియాక్షన్‌ ఏంటంటే..

కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్‌ ప్రీత్ సింగ్‌(Rakul Preet Singh).. 'వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌' తో జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్లిపోయింది. తెలుగుతో పాటు తమిళ, బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంది.

Rakul Preet Singh: కండోమ్‌ టెస్టర్‌గా రకుల్‌.. ఆమె తల్లిదండ్రులు రియాక్షన్‌ ఏంటంటే..
Rakul
Basha Shek
|

Updated on: Mar 08, 2022 | 8:47 AM

Share

కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్‌ ప్రీత్ సింగ్‌(Rakul Preet Singh).. ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌’ తో జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్లిపోయింది. తెలుగుతో పాటు తమిళ, బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఎక్కువగా గ్లామర్‌ పాత్రలు పోషిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ‘ఓబుళమ్మ (కొండపొలంలో రకుల్‌ క్యారెక్టర్‌) లాంటి వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయగలదు. ఈనేపథ్యంలో ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ఛత్రివాలి (Chhatriwali). ఇందులో కండోమ్ టెస్టర్‌ (condom tester) గా ఓ డిఫరెంట్‌ అండ్‌ బోల్డ్‌ పాత్రలో కనిపించనుంది రకుల్‌. కాగా ఈ క్యారెక్టర్‌ గురించి, అలాగే తల్లిదండ్రుల స్పందన గురించి ఇటీవల ఓ సందర్భంలో పెదవి విప్పింది పంజాబీ బ్యూటీ. ‘ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటి నుంచో మన సమాజంలో ఉన్నదే. దీనినే మేం సరికొత్త ప్రయత్నంలో ప్రేక్షకులకు చూపెట్టనున్నాం. చాలా సులభంగా అందరూ మెచ్చేలా ఓ కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కించాం. ఇది ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్‌గా మారిన ఓ అమ్మాయి కథ. మొదట కేవలం జీతం కోసమే జాబ్‌లో చేరి అనంతరం దాని ప్రాధాన్యత ఏంటో తెలుసుకునే అమ్మాయి పాత్ర నాది’

‘మనం ఎలా పుడతామో అందరికీ తెలుసు. కానీ దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. సిగ్గుపడతాం. మొహమాటపడతాం. యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. వారికి ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా తెలియాలి. అలా అనీ ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలేవి ఉండవు. వాస్తవానికి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే కెరీర్ పరంగా కొంచెం ఇబ్బంది ఎదురవ్వొచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకే ఈ క్యారెక్టర్‌ని చేయాలనుకున్నాను. ఇక ఈ సినిమా పాత్ర గురించి నా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వాళ్లు మరో ఆలోచన లేకుండా నన్ను చేయమని ప్రోత్సాహించారు. ఇదొక్కటే నేను చేసే ప్రతి సినిమా కథ గురించి అమ్మానాన్నలకు చెబుతాను. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఓకే చెబుతాను. ఎందుకంటే మా పేరెంట్స్‌ కూడా ప్రేక్షకులే’ అని రకుల్‌ చెప్పుకొచ్చింది. కాగా ఛత్రీవాలి సినిమాతో పాటు హిందీలో అటాక్‌, రన్‌వే 34, డాక్టర్‌ జి, అయలాన్‌, మిషన్‌ సిండ్రెల్లా అనే చిత్రాల్లో నటిస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ. Also Read:Akhil Akkineni : బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌తో అక్కినేని ప్రిన్స్ భారీ మూవీ ప్లాన్..

Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలోనే వెండి.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

International Women’s Day: పీటీ ఉష నుంచి మిథాలీ వరకు.. దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత క్రీడాకారిణులు