International Women’s Day: పీటీ ఉష నుంచి మిథాలీ వరకు.. దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత క్రీడాకారిణులు

మార్చి 8న మహిళా దినోత్సవం. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ఈ రోజు మనం క్రీడా ప్రపంచంలోని 8 మంది మహిళల గురించి తెలుసుకుందాం. వారు ధైర్యం, శక్తికి ఉదాహరణగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రేరణగా నిలిచారు.

Venkata Chari

|

Updated on: Mar 08, 2022 | 8:22 AM

మార్చి 8న మహిళా దినోత్సవం. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ఈ రోజు మనం క్రీడా ప్రపంచంలోని 8 మంది మహిళల గురించి తెలుసుకుందాం. వారు ధైర్యం, శక్తికి ఉదాహరణగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రేరణగా నిలిచారు.

మార్చి 8న మహిళా దినోత్సవం. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ఈ రోజు మనం క్రీడా ప్రపంచంలోని 8 మంది మహిళల గురించి తెలుసుకుందాం. వారు ధైర్యం, శక్తికి ఉదాహరణగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రేరణగా నిలిచారు.

1 / 9
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భారతదేశంలోని సనాతన ఆలోచనలను సవాలు చేసే క్రీడాకారిణిగా పేరు గాంచింది. భారత్ తరఫున ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఏకైక మహిళా క్రీడాకారిణి. పాకిస్థానీ క్రికెటర్‌ని పెళ్లాడినందుకు ట్రోల్స్‌కు గురయ్యారు. అయితే, ఇంత జరిగినా సానియా తన ఆటతీరుతో దేశమంతటా వెలుగులు నింపింది. అదే సమయంలో రెండేళ్ల క్రితం తల్లి అయిన తర్వాత, మరలా టెన్నిస్ ప్రపంచంలోకి తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆమె సూపర్‌మామ్‌గా మారింది.

2 / 9
వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లీశ్వరి ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ఘనత సాధించింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ ప్లేయర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 1995లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 1999లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

3 / 9
భారత పారాలింపియన్ దీపా మాలిక్ మహిళా క్రీడాకారిణిగానే కాకుండా వ్యక్తిత్వంగా కూడా ఆదర్శంగా నిలిచింది. 2016లో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజత పతకాన్ని సాధించింది. దీపా మాలిక్ శరీరంపై అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. దాని కారణంగా ఆమె వీల్ చైర్‌పై కూర్చోవలసి వచ్చింది. ఆమె అన్ని విధాలుగా తనను తాను నిరూపించుకుంది. దాని కారణంగా ఆమె మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచింది.

4 / 9
2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా నెహ్వాల్ రూపంలో భారతదేశానికి ఒక మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లభించింది. ఆమె దేశంలోని కోట్లాది మంది బాలికలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒలింపిక్ పతక విజేత దేశంలోని చాలా మంది బాలికలు బ్యాడ్మింటన్ ఆటను కెరీర్‌గా తీసుకునేలా ప్రేరేపించిందనడంలో సందేహం లేదు. నేడు దేశంలోని అనేక బ్యాడ్మింటన్ అకాడమీలలో లక్షలాది మంది అమ్మాయిలు ఆమెలా ఉండాలని నిర్ణయించుకున్నారు.

5 / 9
భారత బాక్సర్ ఎంసీ మేరీకోమ్ కథ నేడు దేశంలోని ప్రతీ చిన్నారికి తెలిసిందే. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మణిపూర్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. తల్లి అయిన తర్వాత, ఆమె తిరిగి బరిలోకి దిగి, సరికొత్త ఉదాహరణగా నిలిచింది. దేశంలోని కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నేడు దేశంలోని ప్రతి యువ బాక్సర్ మేరీ కోమ్ కావాలని కలలు కంటారు.

6 / 9
భారత క్రీడాకారిణి పీటీ ఉషను దేశపు ఎగిరే ఫెయిరీ అంటారు. 1980లలో ఆసియాలో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా పేరుగాంచింది. ఈ సమయంలో ఆమె మొత్తం 23 పతకాలు సాధించింది. వాటిలో 14 బంగారు పతకాలు ఉన్నాయి. దేశంలోని ఎందరో బాలికలు క్రీడా ప్రపంచంలోకి వచ్చేందుకు పీటీ ఉష స్ఫూర్తిగా నిలిచారు. ఉష తరువాత తర్వాత దేశానికి ద్యుతీ చంద్, హిమదాస్ లాంటి స్టార్లు వచ్చారు.

7 / 9
క్రికెట్ ప్రపంచంలో మిథాలీ రాజ్ పేరుకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. ఈరోజు మహిళా క్రికెటర్లు చాలా గుర్తింపు పొందుతున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, దేశంలో మహిళా క్రికెటర్‌గా పిలిచే పేర్లలో మిథాలీ ప్రముఖంగా నిలిచింది. ఆరు ప్రపంచకప్‌లు ఆడిన మిథాలీ.. ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి తన క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసుకుంది.

8 / 9
దీపా కర్మాకర్, అదితి అశోక్ లాంటి ప్లేయర్లు ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించకపోవచ్చు, కానీ, ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంతో అభిమానాన్ని సంపాధించారు. దీపా కర్మాకర్ 2016 సంవత్సరంలో జిమ్నాస్టిక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతే దేశంలో ఈ క్రీడకు ఆదరణ పెరిగింది. 2021లో టోక్యో ఒలింపిక్స్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అదితి అశోక్ ప్రదర్శన తర్వాత దేశం గోల్ఫ్‌లో భవిష్యత్తును చూడటం ప్రారంభించింది.

9 / 9
Follow us