Women’s Day 2022: మహిళలకు అలెర్ట్.. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ నాలుగింటిని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే..
Women Health Tips: నేటి కాలంలో మహిళలు అన్ని రంగాలలో దూసుకెళ్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. మహిళలు.. ఆఫీసు పని నుంచి కుటుంబం, పిల్లల సంరక్షణ వరకు ఇలా అన్ని విషయాలను మగువలు
Women Health Tips: నేటి కాలంలో మహిళలు అన్ని రంగాలలో దూసుకెళ్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. మహిళలు.. ఆఫీసు పని నుంచి కుటుంబం, పిల్లల సంరక్షణ వరకు ఇలా అన్ని విషయాలను మగువలు చాలా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. మహిళలు తమ కుటుంబ అవసరాలను తీర్చడంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ.. వారు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టరు. దీంతో మహిళలు కూడా ఒక్కోసారి శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండటంతోపాటు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. దీంతోపాటు కుటుంబాన్ని కూడా చాలా సంతోషంగా ఉంచగలుగుతారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే (Health Tips For Women) ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి..
మహిళలు కొన్నిసార్లు తొందరపడి అల్పాహారం మానేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం తీసుకోవాలి. ఇది రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఈ అల్పాహారంలో పీచు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం మానుకోవాలి
కొన్ని సమాయాల్లో చాలామంది చిరుతిండి లాంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. సమయం లేనప్పుడు జంక్ ఫుడ్స్ తింటుంటారు. ఇలా చేస్తే సమయాన్ని ఆదా చేయవచ్చనుకుంటారు. కానీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భోజనం మధ్యలో మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా, ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడానికి ప్రయత్నించాలి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ లాంటివి తినవచ్చు. అవి పోషకాలు అందించడంతోపాటు శక్తివంతంగా ఉంచుతాయి.
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల చాలా సార్లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో కాళ్ళలో నొప్పి, వెన్నునొప్పి మొదలైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే కనీసం 30 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. ఇది వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
తగినంత నీరు తాగాలి..
ఎప్పుడూ కూడా తగినంత నీరు తాగాలి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చాలా సార్లు డీహైడ్రేషన్ వల్ల నీరసం, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. తగినంత నీరు తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుతంది. నిత్యం కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి.
Also Read: