Liver Health: కాలేయంను ఆరోగ్యంగా ఉంచే 10 ఆహార పదార్థాలు ఏమిటో తెలుసా..?
Healthy Liver Tips: మన శరీరంలో వివిధ అవయవాలతో పాటు ముఖ్యమైనది కాలేయం. శరీరంలో ఇది శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే ఎంతో మంచిది...
Healthy Liver Tips: మన శరీరంలో వివిధ అవయవాలతో పాటు ముఖ్యమైనది కాలేయం. శరీరంలో ఇది శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే ఎంతో మంచిది. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేయడానికి, గ్లూకోస్ తయారుచేయడానికి కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా కాలేయం (Liver) పోషకాలను నిల్వచేసుకొని పిత్తాన్ని కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యవంతంగా పనిచేసినప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలను సరైన క్రమంలో జీర్ణం చేసి అందులో ఉన్న పోషకాలను రక్తంలోకి ప్రవహించేలా చేస్తుంది. మన శరీరంలో ఉండే కాలేయం సరైన క్రమంలో పనిచేయకపోతే ఎన్నో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలు మన కాలేయం యొక్క పరిస్థితిని నిర్ధారిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాలేయం సరిగ్గా పని చేయకపోతే పనిచేయకపోతే జీర్ణక్రియ సమస్యలతో పాటు టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను, పానీయాలను తీసుకోవాలో తెలుసుకుందాం.
వెల్లుల్లి:
భారతీయ వంటింట్లో దొరికే వాటిలో వెల్లుల్లి కీలకమైనది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఆహార పదార్థాలలో భాగంగా వెల్లుల్లిని చేర్చడం వల్ల ఇది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో అధికభాగం యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది కాలేయానికి ప్రమాదం కలిగించే బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది.
ఓట్ మీల్:
తరచూ మన ఆహారంలో భాగంగా ఓట్ మీల్ తీసుకోవటం వల్ల అధిక మొత్తంలో ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఓట్ మీల్ లో అధికభాగం ఫైబర్ తో పాటు, బీటా-గ్లూకాన్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కాలేయానికి ఎంతో సహకరిస్తాయి. కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వులను కరిగించడంలో దోహదపడుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది.
చేపలు:
కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ముఖ్యంగా సాల్మన్ చేపలు అధిక భాగం ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఇవి మన కడుపులో ఏర్పడిన మంటను తగ్గించడంలో ఉపయోగపడే మంచి కొవ్వులు. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ సాల్మన్ చేపలను వారంలో కనీసం రెండు సార్లు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
కాఫీ:
ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. క్రమం తప్పకుండా ప్రతిరోజు కాఫీ తాగటం వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రభావం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల కాలేయంలో ఉన్న కొవ్వు పెరుగుదలను తగ్గించడమే కాకుండా, కాలేయంలో రక్షణాత్మక యాంటీఆక్సిడెంట్స్ పెంపొందించడంలో కూడా కాఫీ దోహదపడుతుంది.
గ్రీన్ టీ:
కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఉంచడంలో దోహదపడతాయి.
బెర్రీలు:
బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీ లలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు ఈ బెర్రీస్ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ద్రాక్ష:
ద్రాక్ష మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కాలేయం దెబ్బ తినకుండా ఉండటానికి ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ద్రాక్ష, ద్రాక్ష రసం, విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలేయంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
ఆలివ్ ఆయిల్:
అధిక మొత్తంలో కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తినడం కాలేయానికి మంచిది కాదు. ఒక అధ్యయనం ప్రకారం మన ఆహార పదార్థాలలో భాగంగా ఆలివ్ ఆయిల్ తీసుకోవటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కాలేయ పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు తెలియజేశారు. నూనెలలో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు.
గుడ్లు:
గుడ్లలో సల్ఫర్ సమ్మేళనాలు, మిథైలేషన్ ఎలిమెంట్స్ మరియు గ్లూటాతియోన్, ప్రొటీన్లు విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. గుడ్లలో కెరోటినాయడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది.
గింజలు:
సాధారణంగా గింజలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో ఏర్పడే మంటను తొలగించడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో వాల్నట్, బాదం వంటి కొన్ని గింజలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గింజలు అధికభాగం కేలరీలను కలిగి ఉండటం వల్ల ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అధికంగా శరీర బరువు పెరుగుతారు.
ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, చిప్స్ వంటి ప్యాక్డ్ స్నాక్స్, గింజలలో కూడా కొవ్వులు అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే రొట్టెలు, పాస్తా, కేకులు వంటి పండి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయానికి ప్రమాదం వాటిల్లుతుంది. రోజువారీ ఆహారంలో ఉప్పును తక్కువ తీసుకోవడం మంచిది. ఉప్పును ఎక్కువగా వాడేవారు కాలేయ సమస్యతో పాటు అధిక రక్తపోటును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆల్కహాల్ సేవించే వారిలో కాలయంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా మద్యం సేవించే వారిలో కాలేయ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు కూడా ఉండవచ్చు.
కాలేయం దెబ్బతింటుందంటే సంకేతాలివే..
కాలేయం దెబ్బతినే ముందు పలు సంకేతాలు వస్తుంటాయి. వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట, విరేచనాలు, కామెర్లు, నిరంతరం బరువు తగ్గడం, శరీరంలో దురద, పొత్తికడుపులో ద్రవ ఏర్పడటం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఇవి కాలేయం దెబ్బతినే ముందు ఇలాంటి సంకేతాలు వస్తుంటాయి. అనుమానం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)
ఇవి కూడా చదవండి: