Curry Leaves Water: కరివేపాకు నీళ్లతో ఈ సమస్యలకు చెక్.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసుకోండి..
జీర్ణ సమస్యలు ఉన్నవారు కరివేపాకు బాగా తినాలి. ఎందుకంటే ఇందులో మన పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లాక్సిటివ్స్ ఉంటాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
కరివేపాకులోని వాసన, రుచి మనందరినీ ఆకర్షిస్తాయి. దీనిని సాంబార్, దోస, కొబ్బరి చట్నీ వంటి దక్షిణ భారత వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికి ఆయుర్వేదంలోనూ బాగా ప్రాముఖ్యత ఉంది . ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అదేవిధంగా కరివేపాకు నీళ్లతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ను కరిగించుకుని బరువు తగ్గేందుకు కరివేపాకు నీరు బాగా ఉపయోగపడుతుందటున్నారు. దీని వినియోగం ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడుతుందంటున్నారు. అయితే దీని ప్రభావం వెంటనే కనిపించదని, కొన్ని రోజుల తర్వాత కనిపిస్తుందని సూచిస్తున్నారు.జీర్ణ సమస్యలు ఉన్నవారు కరివేపాకు బాగా తినాలి. ఎందుకంటే ఇందులో మన పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లాక్సిటివ్స్ ఉంటాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
మానసిక సమస్యలు దూరం..
ఇక కరివేపాకుతో నీరు తాగడం వల్ల శరీరం నుండి విషతుల్య పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. వాస్తవానికి ఈ ఆకులలోని యాంటీ-ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. అలాగే చర్మ వ్యాధులు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాగా పని ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలతో బాధపడేవారికి కరివేపాకు నీళ్లు దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇక కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఒబేసిటీ కూడా బాగా తగ్గుతుంది. కరివేపాకు పొడిని తీసుకోవడం వలన నోటి అల్సర్ సమస్య తగ్గుతుంది. ఇవే కాకుండా.. షుగర్ ను తగ్గించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి