AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Oil Benefits: కొబ్బరి నూనెతో వంటలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనమో తెలుసా?

సాధారణంగానే చాలా మంది తమ వంటల కోసం వినియోగించే నూనెను మంచి బ్రాండ్‌లలో తీసుకుంటారు. సన్‌ఫ్లవర్, రైస్ బ్రాన్ వంటి వివిధ రకాల నూనెలలను వినియోగిస్తుంటారు.

Coconut Oil Benefits: కొబ్బరి నూనెతో వంటలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనమో తెలుసా?
Coconut Oil
Shiva Prajapati
|

Updated on: Nov 22, 2022 | 8:34 AM

Share

సాధారణంగానే చాలా మంది తమ వంటల కోసం వినియోగించే నూనెను మంచి బ్రాండ్‌లలో తీసుకుంటారు. సన్‌ఫ్లవర్, రైస్ బ్రాన్ వంటి వివిధ రకాల నూనెలలను వినియోగిస్తుంటారు. అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడే, బరువును నియంత్రణలో ఉంచే నూనెలను వినియోగిస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉంటే.. అన్నింటికంటే కొబ్బరి నూనె చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతర్గత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ చాలా అవసరం కూడా.

వంటల్లో కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1. బ్లడ్ షుగర్ నియంత్రణ: కొబ్బరి నూనె బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. 2009లో యానిమల్ స్టడీస్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. కొబ్బరి నూనెలో ఉండే సంతృప్త కొవ్వు ఇన్సులిన్ స్పైక్‌లను నివారిస్తుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

2. మెదడు ఆరోగ్యానికి మేలు: కొబ్బరి నూనె శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కనుగొంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కొబ్బరినూనెలోని పోషకాలు డిప్రెషన్‌తో బాధపడేవారికి దివ్యఔషధంగా పని చేస్తుందని పరిశోధనలో తేలింది.

ఇవి కూడా చదవండి

3. హెల్తీ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది: కొబ్బరి నూనెను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పబ్‌మెడ్‌సెంట్రల్ పరిశోధనలో కొబ్బరికాయలలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. 8 వారాల పాటు కొబ్బరి నూనెను తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని పరిశోధనలో తేలింది.

4. కాలేయ వ్యాధిని నివారిస్తుంది: కాలేయ సమస్యలకు కొబ్బరి నూనె మంచి ఎంపిక. విలే ఆన్‌లైన్ లైబ్రరీ ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో, కొబ్బరి నూనెను తినే ఎలుకలు 4 వారాల పాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయని తేలింది. కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లయితే వైద్యుని సలహాతో క్రమం తప్పకుండా కొబ్బరినూనెను తీసుకోవడం ప్రారంభించవచ్చు.

5. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి నూనెను చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని కారణంగా ఇది చర్మం, జుట్టును బాహ్యంగా మెరుగుపరుస్తుంది. అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు తగ్గడానికి ఉత్తమమైన వంట నూనె కోసం చూస్తున్నట్లయితే కొబ్బరి నూనె గొప్ప ఎంపిక. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కొబ్బరి నూనెలోని సంతృప్త కొవ్వు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. తదుపరి భోజనంలో తక్కువ కేలరీలను తీసుకునేలా సహాయపడతాయి.

గమనిక: దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. ఇందులోని సమాచారం నిపుణులు సలహాలు, సూచనలు మాత్రమే. ఏదైనా సమస్య ఉంటే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..