Cholesterol Reduce Tips: ఒంట్లో కొలెస్ట్రాల్‌ని ఇలా నేచురల్‌గా తగ్గించేసుకోవచ్చు!
ప్రస్తుతం ఇప్పుడు అన్ని వయసుల వారు హై కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక సాధారణ సమస్యలా మారిపోయింది. శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమే కానీ.. మరీ ఎక్కువగా అయితేనే ప్రాబ్లమ్. కొలెస్ట్రాల్‌లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. ధమనుల్లో పేరుకుపోతుంది. దీని వల్ల రక్త నాళాలు సంకుచితం అవుతాయి. దీంతో గుండె రక్త నాళాల్లో పూడికలు ఏర్పడి.. గుండె సమస్యలు రావచ్చు. వీలైనంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను..

ప్రస్తుతం ఇప్పుడు అన్ని వయసుల వారు హై కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక సాధారణ సమస్యలా మారిపోయింది. శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమే కానీ.. మరీ ఎక్కువగా అయితేనే ప్రాబ్లమ్. కొలెస్ట్రాల్‌లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. ధమనుల్లో పేరుకుపోతుంది. దీని వల్ల రక్త నాళాలు సంకుచితం అవుతాయి. దీంతో గుండె రక్త నాళాల్లో పూడికలు ఏర్పడి.. గుండె సమస్యలు రావచ్చు. వీలైనంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుంటేనే చాలా మంచిది. మన ఇంట్లో లభించే వాటితోనే నేచురల్ గా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
యాపిల్:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గాలంటే.. ప్రతి రోజూ యాపిల్ తీసుకోవడం చాలా మంచిది. రోజూ యాపిల్ తింటే.. డాక్టర్‌కు, వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్న విషయం అందరికీ తెలుసు. కానీ నిర్లక్ష్యం చేస్తారు. కానీ యాపిల్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉన్న వారు స్మోకింగ్‌కి చాలా దూరంగా ఉండాలి.
కరిగే ఫైబర్ తీసుకోవాలి:
కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దరి చేరవు. పొట్ట ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి:
ఆకు కూరల్లో కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. అదే విధంగా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెయింటేన్ చేయడానికి, గుండె హెల్దీగా ఉండటానికి ఆకు కూరలు కూడా చాలా ముఖ్యం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి:
వ్యాయామం చేయడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. చాలా మంచిది. శారీరక శ్రమ కూడా అవసరం. రెగ్యులర్ వ్యాయామం వల్ల బాడీ చురుకుగా ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. అదే విధంగా మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.
జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి:
కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు.. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కి చాలా దూరంగా ఉండాలి. వీటి వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వెన్న, చీజ్ వంటి వాటిని తినకపోతేనే బెటర్. వీటి వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.