AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood sugar: ఈ సింపుల్ టిప్స్ తో.. మధుమేహన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు..

ప్రతి రోజు వ్యాయమం చేయడం, సమతూకంలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గడం కోసం ఎటవంటి ఆహారం తీసుకోకుండా ఉండటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం..

Blood sugar: ఈ సింపుల్ టిప్స్ తో.. మధుమేహన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు..
Ways To Control Blood Sugar
Amarnadh Daneti
|

Updated on: Oct 21, 2022 | 9:40 PM

Share

మధుమేహం వ్యాధి ఉన్న వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈబ్లడ్ షుగర్ జీవితంలో మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈక్రమంలో మధుమేహం వ్యాధిని నియంత్రణలో ఉంచాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు అవసరం. వైద్యులు సూచించిన సలహాలను పాటించడంతో పాటు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మధుమేహం వ్యాధి ఉన్న వ్యక్తి ప్రతిరోజూ తన దినచర్యలో భాగంగా శారీరక వ్యాయమం చేయాలి. కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. వాకింగ్, సైక్లింగ్, రోలర్ బ్లేడింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ లేదా క్రీడలు ఆడటం వంటి శారీరక వ్యాయమాలు చేస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బరువు అధికంగా పెరగకుండా చూసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. ప్రతి రోజు వ్యాయమం చేయడం, సమతూకంలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గడం కోసం ఎటవంటి ఆహారం తీసుకోకుండా ఉండటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

ఆహార అలవాట్లలో మార్పు

మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆహారం పడితే అది తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయిని పెంచే పదార్థాలు తినకూడదు. రోజులో నాలుగు చపాతీలు ఒకేపూట తీసుకుంటే.. పూటకు రెండు చొప్పున ఒక రోజులో రెండు సార్లు తీసుకోవాలి.డయాబేటిస్ ఉన్న వారు ఆహారంగా తృణధాన్యాలను ఎక్కువుగా తీసుకోవడం మంచిది. కూరగాయలు, బీన్స్ వంటివి తినాలి. పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, పేస్ట్రీలు, అధికంగా కొవ్వు ఉండే జంక్ ఫుడ్ కు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. స్కిన్ లెస్ చికెన్ ను భోజనంతో పరిమితంగా తీసుకొవచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే పరిమితంగా తాగాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి

ఒత్తిడికి గురవ్వకుండా..టెన్షన్ తో కూడిన పనులకు డయాబేటిస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. ఒత్తిడికి గురికావడం వల్ల రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉంది. అందుకే ఒత్తిడికి లోనుకాకుండా ప్రతిరోజూ 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. మనస్సు రీలాక్స్ గా ఉంచుకునేందుకు సంగీతం వినడం, సినిమాలు చూడటం వంటివి చూడటం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!