Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buttermilk Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. నిత్యం భోజనం తర్వాత ఇది తాగితే చాలు..

భారతీయ వంటి గది ఓ ఆరోగ్య భాండాగారం అంటే అతిశయోక్తి లేదంటున్నారు నేటి కాలం వైద్య నిపుణులు. మన ఆహార సంస్కృతి చాలా రకాల హెల్త్..

Buttermilk Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. నిత్యం భోజనం తర్వాత ఇది తాగితే చాలు..
Buttermilk
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 25, 2021 | 12:35 PM

భారతీయ వంటి గది ఓ ఆరోగ్య భాండాగారం అంటే అతిశయోక్తి లేదంటున్నారు నేటి కాలం వైద్య నిపుణులు. మన ఆహార సంస్కృతి చాలా రకాల హెల్త్ బూస్టర్లను అందిస్తుందని.. అయితే వాటిని ఉపయోగించుకోవడంలో నేటి తరం వెనకబడిందంటున్నారు. వంటకాలను మన సౌకర్యానికి తగ్గట్లుగా ఆరోగ్యానికి తగ్గట్టుగా వండుకొవచ్చు. కొన్ని వంటకాలు మన కడుపులో వేడి పుట్టిస్తే.. మరికొన్ని చల్లగా మార్చేస్తాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం బట్టర్ మిల్క్, లస్సీ, సల్ల పేరు ఏదైనా పెరుగును చిలికితే వచ్చేదే మజ్జిగ.

ఇది చిలికిన మజ్జిగ సుగంధ ద్రవ్యాల మిశ్రమం. ఇది ఆరోగ్యం , రుచులను బాలన్స్ చేసే చల్లని పానీయం. ఇది మనకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అంతేకాక బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మనలో ఉత్సాహాన్ని అందిచేందుకు సహాయపడుతుంది.

బటర్ మిల్క్‌లో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల దీన్ని రోజూ మీరు తినే ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం… ఆయుష్యు పెరుగుతాయి. మజ్జిగలో కాల్షియంతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. కొవ్వులు తక్కువగా ఉన్న బటర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ అని పిలువబడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

లాక్టిక్ యాసిడ్ అనే ఈ బ్యాక్టీరియా మనలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బటర్ మిల్క్‌లో విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అయితే, ఫెమినా.ఇన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మజ్జిగ ఎలా తయారు చేసినా దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. ఆహారంతో పాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఇది ఎసిడిటీని అదుపు చేసి ఎముకలను బలపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం..

మజ్జిగ ప్రోబయోటిక్ అంటే అందులో ఆరోగ్యకరమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.

లాక్టిక్ యాసిడ్ అనే మంచి బ్యాక్టీరియా కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ను నివారిస్తుంది. మజ్జిగలోని గుణాల వల్ల పొట్టలోని పోషకాలు త్వరగా జీర్ణమవుతాయి. మజ్జిగలో విటమిన్ డి ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. స్త్రీలు రుతుక్రమం తర్వాత మజ్జిగ తీసుకోవడం మంచిదని భావిస్తారు. దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. మజ్జిగలో ప్రత్యేక జీవ అణువులు ఉంటాయి. అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మజ్జిగలో నామమాత్రపు కొవ్వు ఉంటుంది. అందువల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఫ్యాట్ బర్నర్‌గా పనిచేసి బరువును నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి: TRS: ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు వీరాభిమాని బిగ్ విషెస్.. ఏం చేశాడో చూశారా..

Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..