Health Tips: మలబద్ధకంతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి..

Constipation Home Remedies: దైనందిన జీవితంలో మన ఆహార అలవాట్ల కారణంగా అందరినీ ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ఇంటి చిట్కాలతోనే ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Nov 25, 2021 | 1:20 PM

గోరువెచ్చని నీరు - మలబద్ధకం చికిత్సకు సులభమైన మార్గం గోరు వెచ్చని నీరు తాగడం. వీలైనప్పుడల్లా గోరువెచ్చని నీటిని తాగితే.. మలబద్ధకం సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పరగడుపున కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. దీంతోపాటు రోజంతా 2-4 లీటర్ల నీరు తాగాలి.

1 / 5
ప్రోబయోటిక్స్ - ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పటిష్టం చేస్తుంది. ప్రోబయోటిక్స్ ఆహారం మలబద్ధకం చికిత్సలో ప్రభావవంతంగా మారుతాయి. సౌర్‌క్రాట్, పెరుగు, కేఫీన్ వంటి ఆహారాలు సహజమైన ప్రోబయోటిక్స్ లభించే మూలికలు. తరచుగా పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

2 / 5
పైనాపిల్ జ్యూస్ - పైనాపిల్ జ్యూస్ రుచికరమైనది మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మలబద్ధకం, ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
సోపు గింజలు - సోపు గింజలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను పెంచుతాయి. మీ కడుపు ఆరోగ్యాన్ని ఉంచేందుకు రోజూ అర టీస్పూన్ సోపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకుంటే మేలు కలుగుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం వంటి ఉదరసమస్యలు తగ్గుముఖం పడతాయి.

4 / 5
పిప్పరమింట్ ఆయిల్ - పిప్పరమింట్ యాంటిస్పాస్మోడిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2-3 చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచింది. దీంతోపాటు పుదీనా టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

5 / 5
Follow us