Winter Care Tips: స్కిన్ టోన్‌ను బట్టి సరైన ఫేస్ క్రీమ్‌.. శీతాకాలంలో ఏదో ఒకటి ఎంచుకోవద్దు.. సమస్యలు కొని తెచ్చుకోద్దు..

చలికాలంలో ప్రతి ఒక్కరూ తమ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో మీరు మీ చర్మంపై ఏ క్రీమ్ ఉపయోగిస్తున్నారో దానిపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి.

Winter Care Tips: స్కిన్ టోన్‌ను బట్టి సరైన ఫేస్ క్రీమ్‌.. శీతాకాలంలో ఏదో ఒకటి ఎంచుకోవద్దు.. సమస్యలు కొని తెచ్చుకోద్దు..
Applying The Cream
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 25, 2021 | 10:04 AM

చలికాలంలో ప్రతి ఒక్కరూ తమ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో మీరు మీ చర్మంపై ఏ క్రీమ్ ఉపయోగిస్తున్నారో దానిపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి. చలి కాలంలో కొంత లేజీనెస్ కనిపిస్తుంటుంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తుంటాయి. ఇందులో జలుబు, దగ్గు కామన్.. అయితే వీటితోపాటు చర్మసమస్యలు కూడా వేదిస్తుంటాయి. వింటర్ సీజన్‌‌లో బద్ధకం కారణంగా చర్మాన్ని సంరక్షించుకోవడం మానేస్తారు. అయితే వేసవిలో మాదిరిగానే చలికాలంలోనూ చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

శీతాకాలంలో ప్రతి ఒక్కరి చర్మం చాలా పొడిగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించడానికి చాలా మంది కోల్డ్ క్రీం రాస్తుంటారు.  తమ చర్మం రకం తెలుసుకోకుండానే మార్కెట్లో లభించే ఏదో ఒక క్రీమ్ అప్లై చేయడం తరచుగా జరుగుతుంది. ఆ తర్వాత చర్మంపై మొటిమలు, పొడిబారడం, చికాకు  ఇతర సమస్యలు ఏర్పడుతుంటాయి.  అంటే చలికాలంలో మనం వేసుకుంటున్న క్రీములను సరిగ్గా ఎంపిక చేసుకున్న తర్వాతే వాడాలి.

మీ స్కిన్ టోన్‌ను బట్టి సరైన క్రీమ్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసా..

1. పొడి చర్మం

మీ చర్మం పొడిగా ఉన్నట్లయితే..  మీ చర్మంలో ఆయిల్ తక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణంగా చర్మంపై క్రీమ్ అప్లై చేసిన తర్వాత కూడా చాలా త్వరగా పొడిగా మారుతుంది. అటువంటి చర్మంపై క్రీమ్ ఎక్కువసేపు పనిచేయదు. ఇటువంటి పరిస్థితిలో చల్లని వాతావరణంలో కూడా పొడి చర్మం చాలా త్వరగా పగుళ్లు ఏర్పడుతాయి. ఈ రకమైన చర్మం కోసం మీరు హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉన్న అటువంటి క్రీమ్లను ఎంచుకోవాలి.

2. జిడ్డు చర్మం

చలికాలంలో కూడా చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది. ఈ రకమైన చర్మం ఉన్నవారికి ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ముఖంపై క్రీమ్ అప్లై చేసిన తర్వాత మరింత జిడ్డుగా మారుతుంది. దుమ్ము, మట్టి సమస్య, మొటిమలు జిడ్డు చర్మంపై ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో జిడ్డుగల చర్మం ఉన్నవారు జెల్, సీరం  చాలా తక్కువ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉన్నారన అర్థం చేసుకోవాలి. ఇలాంటివారు బాడీ లోషన్ ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

3. సున్నితమైన చర్మం

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి చలికాలంలో దురద సమస్య ఉండవచ్చు. అటువంటి చర్మం ఉన్నవారు తమ కోసం క్రీమ్‌ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చర్మంపై చాలా క్రీమ్‌లు అలెర్జీని కలిగిస్తాయి. వీలైనంత వరకు ఈ వ్యక్తులు యాంటీఆక్సిడెంట్లు సువాసనలు లేని క్రీములను ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి: Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..

Chanakya Niti: జీవితంలో మార్పును కోరుకుంటున్నారా.. చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే