Health: చేదున్నా తినండి బ్రదర్.. ఒక్క కాకరకాయ వందలాది సమస్యలకు సంజీవని..!

Bitter Gourd Health Benefits: కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే.. చాలామంది వైద్య నిపుణులు కాకరకాయ తినమని చెబుతుంటారు. వాస్తవానికి కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది. దీంతో చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. చేదున్నప్పటికీ.. అనేక పోషకాలు దాగున్న ఒక పోషకరమైన కూరగాయని.. దీనిని రెగ్యులర్ గా తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Health: చేదున్నా తినండి బ్రదర్.. ఒక్క కాకరకాయ వందలాది సమస్యలకు సంజీవని..!
Bitter Gourd
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 09, 2023 | 5:48 PM

Bitter Gourd Health Benefits: కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే.. చాలామంది వైద్య నిపుణులు కాకరకాయ తినమని చెబుతుంటారు. వాస్తవానికి కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది. దీంతో చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. చేదున్నప్పటికీ.. అనేక పోషకాలు దాగున్న ఒక పోషకరమైన కూరగాయని.. దీనిని రెగ్యులర్ గా తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాకరకాయను.. కూరగాయగా ఇంకా చిప్స్, సలాడ్ లేదా జ్యూస్ వంటి మార్గాల్లో తీసుకుంటారు. కాకరకాయ చేదును తట్టుకోలేకపోతే ఉప్పు, నిమ్మరసం వేసి దానిని తగ్గించుకోవచ్చు. ఇంకా ఉడికించి కూడా తింటారు. కాకరకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. వాపులు తగ్గుతాయి: కాకరకాయలో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. దీని ద్వారా మీరు శరీరంలోని వాపును తగ్గించవచ్చు. కాకరకాయను రెగ్యులర్ గా తింటే, బహుశా అలాంటి సమస్య మున్ముందు కూడా రాదని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
  2. డయాబెటిస్‌లో ప్రయోజనకరమైనది: డయాబెటిక్ రోగులకు కాకరకాయ ఒక ముఖ్యమైన ఆహారం.. వారు ప్రతిరోజూ దాని రసాన్ని తాగితి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే రసాయనాలు ఉన్నాయి.
  3. జీర్ణక్రియకు ఉత్తమం: కాకరకాయ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, గ్యాస్‌తో సహా అనేక కడుపు సమస్యలను దూరం చేస్తుంది.
  4. బరువు తగ్గడం: కాకరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు పొట్ట, నడుము కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేదును తినండి.
  5. లివర్ కు మేలు: కాకరకాయలోని పోషకాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు సహాయపడతాయి. దీనిలోని పలు ఔషధాలు లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  6. చర్మ సమస్యలు దూరం: కాకరకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇది ఔషధం కంటే తక్కువ కాదు.
  7. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం: కాకరకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని కీళ్లలో నొప్పిని తగ్గించగలవు.
  8. కొలెస్ట్రాల్ తగ్గుతుంది: అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలను మీరు ఎదుర్కోకుండా ఉండేందుకు కాకరకాయ పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం కేవలం పాఠాకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా వైద్య, ఆరోగ్య సూచనలను పాటించే ముందు లేదా సందేహాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?