నెయ్యి.. వెన్న.. రెండింటిలో ఏది మేలు.?

TV9 Telugu

26 November 2024

భారతదేశవ్యాప్తంగా వంటకాల్లో నెయ్యి ఎక్కువగా వాడుతుంటాం. ఆయుర్వేద చికిత్సల్లోనూ నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తారు.

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

నెయ్యిలో విటమిన్‌ ఎ, ఇ, డి, కె వంటి విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్‌, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికం.

ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్‌ నెయ్యి తింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.

పెరుగు నుంచి వచ్చే వెన్న సైతం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెన్నలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి.

శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించడానికి వెన్నలోని లూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. దిన్ని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన తక్షణమే శరీరానికి కావలసిన ఎనర్జీ వస్తుంది.

వెన్నలోని ఫ్యాట్‌ కొలెస్ట్రాల్ పిల్లల మెదడు పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడుతుంది. అరాచిడోనిక్ యాసిడ్ బ్రెయిన్ శక్తివంతంగా పనిచేసేలా సహాయపడుతుంది.

వెన్నలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెన్నను మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.