TG Staff Nurse Result Date: నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలోనే ఫలితాలు

నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. కీతోపాటు రెస్పాన్స్ షీట్లు కూడా వెబ్ సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు..

TG Staff Nurse Result Date: నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలోనే ఫలితాలు
Staff Nurse Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2024 | 6:50 AM

హైదరాబాద్, నవంబర్‌ 27: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి నవంబరు 23వ తేదీన రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తాజాగా విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్‌ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలు తెలియజేయవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో మొత్తం 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్‌లో 61 పోస్టులు, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సు పోస్టుతో కలిపి.. మొత్తం 2050 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నారు. కాగా రాతపరీక్షకు 80 మార్కులు కేటాయిస్తారు. మిగతా 20 మార్కులు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు వెయిటేజీ కింద కేటాయిస్తారు.

తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

వెబ్‌సైట్లో జూనియర్‌ లెక్చరర్‌ ఎకనామిక్స్ ఎంపిక జాబితా వెల్లడి

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలోని కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఎకనామిక్స్, ఎకనామిక్స్‌ ఉర్దూ మీడియం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించింది. మొత్తం 87 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మల్టీజోన్-1 పరిధిలో 36 మంది, మల్టీజోన్ 2 పరిధిలో 48 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఉర్దూమీడియంలో ముగ్గురు అభ్యర్థులు ఎంపికయ్యారు. మొత్తం 16 సబ్జెక్టులకు ఈ పరీక్షలు జరగగా జులై 8న ఫలితాలు విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సబ్జెక్టులవారీగా 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత.. జూనియర్ లెక్చరర్స్ జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.