Subbaraju: లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?

టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. కాస్త లేటుగా అయినా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు.

Subbaraju: లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?
Subbaraju
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2024 | 6:31 AM

ప్రముఖ నటుడు సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఈ మేరకు తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన భార్యతో కలిసి బీచ్ లో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నాడు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుబ్బరాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సుబ్బరాజు సతీమణి గురించి వివరాలు ఇంకా తెలియరాలేదు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అతను అనుకోకుండా డైరెక్టర్ దగ్గనే పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు. మొదట ‘ఖడ్గం’ సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

ఖడ్గం తర్వాత ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్‌, బిందాస్, గోల్కొండ హైస్కూల్, దూకుడు, పంజా, బిజినెస్‌ మ్యాన్‌, ఎవడు, శ్రీమంతుడు, బాహుబలి 2, దువ్వాడ జగన్నాథం, గీతా గోవిందం, ఎఫ్ 2, మజిలీ, గద్దల కొండ గణేష్, అఖండ, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య, శాకుంతలం, బ్రో తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్‌, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు సుబ్బరాజు. ఎక్కువగా విలన్ వేషాలు వేసినప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు సుమారు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడీ స్టార్ యాక్టర్.

ఇవి కూడా చదవండి

బీచ్ లో భార్యతో సుబ్బరాజు..

View this post on Instagram

A post shared by Subba Raju (@actorsubbaraju)

కాగా ఈ ఏడాది జితేందర్ రెడ్డి అనే సినిమాలో నటించాడు సుబ్బరాజు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

స్టైలిష్ లుక్ లో సుబ్బరాజు..

View this post on Instagram

A post shared by Subba Raju (@actorsubbaraju)

బాహుబలి 2 తో జపాన్ లోనూ సుబ్బరాజుకు ఫ్యాన్స్..

View this post on Instagram

A post shared by Subba Raju (@actorsubbaraju)

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.