Priyanka Jain: తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ ప్రియాంకపై భక్తుల ఆగ్రహం

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. బుల్లితెర ప్రముఖ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్న ఆమె తాజాగా అతనితో కలిసి తిరుమలకు వెళ్లింది. అయితే ఇద్దరూ కలిసి సరదాగా చేసిన ఒక పని ఇప్పుడు వారిని చిక్కుల్లో పడేసింది.

Priyanka Jain: తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ ప్రియాంకపై భక్తుల ఆగ్రహం
Priyanka Jain
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2024 | 7:08 AM

జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది ప్రియాంక జైన్. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో మెప్పించి ఏకంగా టాప్-5లో నిలిచింది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అందరికీ పరిచయం చేసిందీ అందాల తార. గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉండే ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లవర్ తో కలిసి తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటుంది. వాటిని తన యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. అలా తాజాగా తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది ప్రియాంక. ఇక్కడి వరకు బాగానే ఉంది అక్కడ కూడా ఓ ఫ్రాంక్ వీడియో చేశారీ లవ్ బర్డ్స్. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక. చిరుత పులి వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. అనంతరం ‘తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్? అంటూ షాకింగ్‌ అయిన ఫొటోలతో వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. అయితే ‘చివరికి చిరుత లేదు.. అదంతా ఫ్రాంక్’ అంటూ తమ అందరినీ ఫూల్స్ చేసింది ప్రియాంక.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ మండి పడుతున్నారు. దీంతో పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం, తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రియుడితో బిగ్ బాస్ ప్రియాంక జైన్..

కాగా తమ వీడియోపై బాగా నెగెటివిటీ రావడంతో తమ ఫ్రాంక్ వీడియోను యూట్యూబ్ ఛానెల్ నుంచి తొలగించింద ప్రియాంక జైన్. అయినా కూడా వీరిపై విమర్శలు ఆగడం లేదు. టీటీడీ కూడా దీనిపై స్పందించే అవకాశముందని తెలుస్తోంది.

ప్రియాంక ఇన్ స్టా గ్రామ్ వీడియో..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.