Brahmamudi, November 27th Episode: ఇందిరా దేవిని అవమానించిన ధాన్యలక్ష్మి.. కళ్యాణ్‌కు మంచి రోజులు!

ప్రకాశాన్ని ధాన్యలక్ష్మి గెంటేయడంతో రాజ్ గదిలోకి వచ్చి పడుకుంటాడు. ఒకవైపు ప్రకాశం, మరోవైపు సుభాష్ పడుకుని గురక పెడుతుంటే రాజ్ నిద్ర చెడిపోతుంది. దీంతో చేసేది ఏమీ లేక కింద పడుకుంటాడు. ఇంకోవైపు ఇందిరా దేవిని అవమానిస్తుంది ధాన్యలక్ష్మి..

Brahmamudi, November 27th Episode: ఇందిరా దేవిని అవమానించిన ధాన్యలక్ష్మి.. కళ్యాణ్‌కు మంచి రోజులు!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 27, 2024 | 12:26 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ప్రకాశాన్ని బయట పడుకోమని గెంటేస్తుంది ధాన్యలక్ష్మి. ప్రకాశం నేరుగా రాజ్ గదికి వెళ్తాడు. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? అని రాజ్ అడిగితే.. వాడి మొహం చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా.. మీ పిన్ని వాడిని బయటకు గెంటేసి తలుపు వేసేసినట్టు ఉందని సుభాష్ అంటాడు. అంటే ఏంటి నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా అని రాజ్ అడిగితే.. అవునని ప్రకాశం అంటాడు. ఇక ప్రకాశం వచ్చి రాజ్ బెడ్ మీద పడుకుంటాడు. మరోవైపు సుభాష్ పడుకుంటాడు. ఇక చేసేది ఏమీలేక రాజ్ మధ్యలో పడుకుంటాడు. ఆ తర్వాత కావ్య ఒక్కర్దే బయట కూర్చుంటుంది. ఆ తర్వాత అపర్ణ వచ్చి కూర్చుంటుంది. అప్పుడే ఇందిరా దేవి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తి చెప్పండి అత్తయ్యా అని అపర్ణ అంటే.. నీకేంటి కోడలి కోసం వెళ్లి.. అక్కడ కూర్చొని అది వండిన వంటలు హాయిగా కూర్చొని తింటున్నావు. ఇక్కడ నా పరిస్థితే దారుణంగా ఉంది. ఇన్నాళ్లూ నువ్వు నా బాగోగులు చూశావు.. ఆ తర్వాత కావ్య చూసుకుంది. ఇప్పుడు నన్ను ఎవరూ ఈ ఇంట్లో పట్టించుకోడం లేదని ఇందిరా దేవి అంటుంది.

ఇందిరా దేవి బాధ..

అదేంటి అత్తయ్యా అలా అంటున్నారు.. నా కొడుకు మనసు మారి వాడు కావ్యని తీసుకు రావాలనే కదా అని అపర్ణ అంటే.. నీ కొడుకు ప్రయత్నం బాగానే ఉంది కానీ దాని వల్ల ప్రయోజనం ఉండాలి కదా అని పెద్దావిడ అంటే.. ఇప్పుడు గొడవ పడినా ఆ తర్వాత వాడి తప్పు తెలుసుకుని ఇద్దర్నీ తీసుకెళ్తాడు. నాకు ఆ నమ్మకం ఉందని అపర్ణ అంటే.. ఏంటో ఈ గొడవలు వాడి మనసు మార్చి.. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయమని ఇందిరా దేవి చెబుతుంది. అత్తయ్యా.. జరగనవి జరుగుతాయని బాగానే అబద్ధాల వాగ్దానాలు చేస్తున్నారు.. అసలు జరగనవి ఎందుకు అని కావ్య అంటుంది. వాడు వెళ్లిపొమ్మంటే.. చొక్కా పట్టుకుని నిలదీయడం మానేసి.. ఇలా పుట్టింటికి రాకూడదు. అబ్బాబ్బా నీలాంటి దాన్ని ఎక్కడా చూడలేదని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ భోజనం తినడానికి వెళ్తారు.

కింద పడుకున్న రాజ్..

ఆ నెక్ట్స్ ప్రకాశం, సుభాష్‌ల మధ్యలో పడుకున్న రాజ్‌కి వాళ్ల గురక కారణంగా నిద్ర పట్టదు. ఇద్దర్నీ లేపుతాడు. రేయ్ ఏంట్రా ఇది అని సుభాష్ అడుగుతాడు. అవునా నేను గురక పెడుతున్నానా.. మీరు అర్జెంట్‌గా మీరిద్దరూ బయటకు వెళ్లిపొమ్మని రాజ్ అంటాడు. రేయ్ ఏంటి మా కోసం కూడా సర్దుకోలేవా అని సుభాష్ అడిగితే.. కుదరదు.. వెళ్లమని అంటాడు. అయితే సరే వెళ్లి మీ మమ్మీని తీసుకు రమ్మని సుభాష్ అంటే.. మీ పిన్నిని కూడా కన్విన్స్ చేయమని ప్రకాశం అంటాడు. సరే వాళ్లను కన్విన్స్ చేయడం కంటే.. ఇక్కడే కింద పడుకుంటానని వెళ్లి కింద పడుకుంటాడు రాజ్. ఆ తర్వాత తెల్లవారుతుంది.. పెద్దాయన దగ్గరకు వెళ్లి పెద్దావిడ వస్తుంది. కావ్య కోసం అపర్ణ ఇంటిని విడిచి వెళ్లిపోయింది. అయినా కూడా వాడిలో ఎలాంటి మార్పు రావడం లేదని పెద్దావిడ అంటే.. తల్లిగా తన వంతు ప్రయత్నం చేస్తుంది కదా అని పెద్దాయన అంటాడు. ఏంటి బావా ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోలేదా అని ఇందిరా దేవి అడిగితే.. పాలు తాగి వేసుకోవడం అలవాటు కదా వేసుకోలేదని చెప్తాడు. ఏంటి ఇంకా ఎవరూ నీకు పాలు ఇవ్వలేదా ఉండు వాళ్ల సంగతి చెప్తానని ఇందిరా దేవి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

ఇందిరా దేవిని అవమానించి ధాన్యలక్ష్మి..

అప్పటికే కిచెన్‌లో ధాన్యలక్ష్మి పాలు కలుపుకుంటుంది. అది చూసి ఓహో పాలు కలుపుతున్నావా.. ఏది మీ మావయ్య గారు ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోలేదు.. పాలు ఇవ్వాలని నీకు తెలీదా అని అడిగి గ్లాస్ తీసుకోపోతే.. ధాన్యలక్ష్మి తీసుకుంటూ అది నా కోసం అత్తయ్యా.. నేను వేరు కుంపటి పెట్టుకున్నాను కదా.. ఎవరు ఏం తాగుతున్నారో నాకెలా తెలుస్తుందని అడుగుతుంది. అప్పుడే రాజ్ హాల్ లోకి వచ్చి అంతా వింటాడు. పని మనిషి శాంతా ఎక్కడ కనిపించడం లేదని పెద్దావిడ అడిగితే.. వేరే వైపు చూస్తూ.. ఏమో నాకు తెలీదని అంటుంది ధాన్యలక్ష్మి. అంటే మీ మావయ్య గురించి పట్టించుకునే బాధ్యత నీకు లేదా అని ఇందిరా దేవి అడిగితే.. అప్పుడే వచ్చిన రుద్రాణి.. ఇది చాలా దారుణం అమ్మా.. తనకు అవసరం అయినప్పుడు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు అవసరం అయినప్పుడు కోడలు బాధ్యతగా వ్యవహరించాలా అని రుద్రాణి అడుగుతుంది. తన పెద్ద కోడలు, కావ్య ఉండటం వల్ల అన్నీ సాగిపోయాయి. వాళ్లు లేకపోయే సరికి సడెన్‌గా మేము గుర్తొచ్చామని ధాన్యలక్ష్మి అంటుంది.

కళ్యాణ్‌కు మంచి రోజులు..

అదంతా విన్న రాజ్.. ఏంటి పిన్నీ ఇది.. ఏంటిది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇలానే మాట్లాడతారా? పాలు ఇస్తే ఇస్తానని చెప్పు.. లేదని చెప్పాలి.. అంతే కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సరే నువ్వు ఏం చేస్తున్నావ్.. నువ్వు అయినా పాలు ఇవ్వాలి కదా అని రాజ్ అడుగుతాడు. వదిలేయ్ తప్పు అంతా నాదే.. మీ అమ్మ మీద, కావ్య మీద ఆధారపడి.. పనులన్నీ వాళ్ల మీద వదిలేశాను.. నేనే వెళ్లి పాలు పెట్టుకుంటానని ఇందిరా దేవి అంటే.. నేను ఇస్తానని రాజ్ అంటాడు. వద్దులే రాజ్ నేను ఇస్తానని స్వప్న అంటుంది. మరోవైపు కళ్యాణ్ సంతోంగా అప్పూని పిలుస్తాడు. బట్టలు ఆరేస్తున్న అప్పూ దగ్గరకు వెళ్లి.. నీకో గుడ్ న్యూస్ అని అంటాడు. అప్పూని కళ్లు మూయమని లిరిక్ లక్ష్మీ ఇచ్చిన చెక్ చేతిలో పెడతాడు. ఏంటి ఆటో నడిపితే చెక్కులు కూడా ఇస్తారా అని అప్పూ వెటకారంగా అంటుంది. నేను ఆటో నడపడం మానేశాను.. ఇక ఆ అవసరం లేదని కళ్యాణ్ అంటాడు. ఏంటి ఈ చెక్ లిరిక్ లక్ష్మీ గారు ఇచ్చారా.. ఇది నిజంగానే గుడ్ న్యూస్. మనకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. అర్జెంట్‌గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. వెంటనే నా శత్రువును కలిసి ఈ విషయం చెప్పాలని అప్పూ అంటుంది. మరోవైపు ఇందిరా దేవి, స్వప్న కలిసి వంట చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..