Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Season: ఈ టీలు ఇమ్యూనిటీని పెంచడమే కాదు.. వాటికి కూడా చెక్ పెడుతుంది

వర్షాకాలం వచ్చేసింది.. దీంతో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటివి మనపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలంటే ఇమ్యునిటీని పెంచుకోవాలి. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడేందుకు..

Monsoon Season: ఈ టీలు ఇమ్యూనిటీని పెంచడమే కాదు.. వాటికి కూడా చెక్ పెడుతుంది
Monsoon Season
Follow us
Chinni Enni

|

Updated on: Jul 24, 2023 | 3:14 PM

వర్షాకాలం వచ్చేసింది.. దీంతో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటివి మనపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలంటే ఇమ్యునిటీని పెంచుకోవాలి. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇంగ్లీషు మందులే కంటే మనం ఇంట్లో చేసుకునే కొన్ని కషాయాలు, టీలు హెల్ప్ అవుతాయి. మరి అవి ఏంటో తెలుసుకుందామా.

1. మాన్ సూన్ టీ: ఇది ఎలా తయారు చేసుకోవాలంటే.. ఓ గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. ఇందులో ధనియాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని.. మరికొంత సమయం మరిగించాక దించి.. కాస్త చల్లారాక అందులో తేనె కలిపి ఆస్వాదించడమే.

ఇది మన బాడీకి యాంటీ బాక్టీరియాగా పని చేస్తూ.. ఇమ్యూనిటీని పెంచుతుంది. వాత, పిత్త, కఫాలను బ్యాలెన్స్ చేస్తుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. తులసి టీ: ఓ పాత్రలో నీరు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత తులసి ఆకులు వేసి గ్లాసుడు నీళ్లు సగం అయ్యేవరకూ మరిగించాక చల్లార్చాలి. తాగడానికి కావాల్సినంత గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, కాస్త తేనె వేసి తాగాలి.

ఈ తులసి టీ తాగడం వలన సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది.

3. లైకోరైస్(అతిమధురం) టీ: ఓ గిన్నెలోని నీరు పోసి బాగా మరుగుతున్నప్పుడు.. అతిమధురం పొడి వేసి మరికాసేపు మరిగించాలి. మూడు కప్పుల నీరు కాస్తా.. సగమయ్యే వరకూ మరగాలి. ఆ తర్వాత కాస్త చల్లారాక.. తేనె వేసుకుని తాగడమే.

వర్షాకాలంలో ముఖ్యంగా ఈ లైకోరైస్ టీని తాగడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గొంతునొప్పి దూరమవ్వడమే కాకుండా.. ​అంటువ్యాధులు రాకుండా.. ఇమ్యూనిటీని పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..