Rainy Season: వర్షాల్లో బట్టలు వాసన లేకుండా తొందరగా ఆరాలంటే ఇలా చేయండి!!
ర్షాకాలంలో చిన్న చిన్న సమస్యలే.. కానీ చాలా చిరాగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో బట్టలు ఒకటి. తడి బట్టలు.. సరిగ్గా ఆరకుండా.. వాసన వస్తూంటాయి. అలాంటి వాటిని..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది. అవసరమైతే తప్ప.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ ప్రజలకు సూచింది. ఈ విషయం పక్కన పెడితే.. వర్షాకాలంలో చిన్న చిన్న సమస్యలే.. కానీ చాలా చిరాగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో బట్టలు ఒకటి. తడి బట్టలు.. సరిగ్గా ఆరకుండా.. వాసన వస్తూంటాయి. అలాంటి వాటిని వేసుకోవాలనిపించదు. మరి బట్టలు చక్కగా ఆరాలంటే.. ఏం టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.
-వర్షంలో బట్టలు త్వరగా ఆరాలంటే నీరంతా పోయేలా బాగా గట్టిగా పిండాలి.
-వర్షంతో బట్టలు బయట ఆరవు కాబట్టి.. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టడం మంచింది.
-కిటికీలు ఓపెన్ చేసి.. ఆ ప్లేస్ లో బట్టలు ఆరేయండి. అప్పుడు కాస్త త్వరగా ఆరతాయి
– వర్షాకాలంలో ఎలాంటి బట్టలైనా త్వరగా ఆరాలంటే.. బ్రష్ డ్రైయింగ్ ఓ బెస్ట్ ఆప్షన్.
– బట్టలు ఆరబెట్టడానికి డ్రైయర్ వాడండి. దీని వల్ల వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరతాయి.
-వర్షాకాలంలో అప్పుడప్పుడు ఎండవస్తుంటుంది. అలాంటప్పుడు బట్టలని తీసుకొచ్చి బయట ఆరబెట్టడం మంచిది.
-ఇంట్లో డీహ్యూమిడి ఫైయర్ ని వాడడం వల్ల ఇంటి లోపల తేమ తగ్గుతుంది. ఇది మీ బట్టలు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది.
-వర్షాకాలంలో బట్టలు ఉతికిన తర్వాత మంచి సువాసన వచ్చే లిక్విడ్స్ వాడినా బట్టలు వాసన రాకుండా ఉంటాయి.