తలగడ పెట్టుకుని నిద్రపోతున్నారా? సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..
కంటినిండా నిద్రపోవాలంటే కొన్ని అనారోగ్య అలవాట్లను వదిలేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఒకటి తలకింద దిండు పెట్టుకొని నిద్రపోవడం. అరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి..
Updated on: Jul 23, 2023 | 12:51 PM

కంటినిండా నిద్రపోవాలంటే కొన్ని అనారోగ్య అలవాట్లను వదిలేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఒకటి తలకింద దిండు పెట్టుకొని నిద్రపోవడం. అరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి.

తలగడా సరిగా లేకపోతే నిద్రకు అంతరాయం కలుగుతుంది. మరీ ఎత్తుగా ఉండే తలగడ కాకుండా తక్కువ ఎత్తు ఉన్న దానిని ఎంచుకోవాటి. పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల మొదట్లో తెలియకపోయినా కొన్ని రోజులు గడిచేకొద్దీ మెడ నొప్పి ప్రారంభమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా వేధించే అవకాశం ఉంది.

అలాగే ఉదయం నిద్రలేవగానే వెన్ను నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తే మీరు వెంటనే దిండు తీసేసి నిద్రపోవాలని సంకేంతం. ఎత్తైన తలగడ వినియోగించడం వల్ల వెన్నెముక వంగిపోయి డిస్క్‌లలో దరం పెరిగిపోతుంది. ఫలితంగా వెన్నునొప్పి వస్తుంది.

ఎత్తయిన తలగడ వల్ల తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఫలితంగా జుట్టుకు సరైన పోషణ లభించక జుట్టు రాలే అవకాశం ఉంది. అలాగే శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తరచూ తిమ్మిర్ల సమస్యలు తలెత్తుతాయి.

తక్కువ ఎత్తుతో మృదువుగా, మెత్తగా ఉండే తలగడను ఎంచుకుని నడుం వాల్చాలి. ఇలా చేయడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.





























