Walking Benefits: వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా…? ఇలా నడవండి మరిన్ని ప్రయోజనాలు

Walking Benefits: ప్రస్తుమున్న రోజుల్లో వ్యాయామం తప్పనిసరి. అలాగే ప్రతి రోజు వాకింగ్‌ చేయడంతో ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్‌ (Walking ) చేయడం..

Walking Benefits: వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా...? ఇలా నడవండి మరిన్ని ప్రయోజనాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 10, 2022 | 8:16 AM

Walking Benefits: ప్రస్తుమున్న రోజుల్లో వ్యాయామం తప్పనిసరి. అలాగే ప్రతి రోజు వాకింగ్‌ చేయడంతో ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్‌ (Walking )చేయడం వల్ల ఎంతో మంచిదని వైద్యులు కూడా పదేపదే చెబుతుంటారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా (Health) ఉండాలంటే నకడ ఎంతో మంచిది. వాకింగ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతిరోజు వాకింగ్‌కు కొంత సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఎంతో మంచిది. ఎక్కువ కాలం బతకాలి.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి..అంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. ప్రస్తుతమున్న రోజుల్లో ఎంతో మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక వాకింగ్‌ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

  1. వేగంగా నడిస్తే అధిక కేలరీలు ఖర్చు అవుతాయి: వేగంగా నడవడం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయనే విషయం మనకు తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి.. అనేది మనకు తెలియదు. తెలిస్తే మరికొన్ని కేలరీలు ఖర్చయ్యేలా నడుస్తాము. నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చుఅవుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
  2. నిదానంగా నడిస్తే..: మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. ఇక నిదానంగా కాకుండా కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50 పైగా కేలరీలు ఖర్చవుతాయి. బ్రిస్క్‌ వాకింగ్‌ గానీ రన్నింగ్‌ కానీ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరగంటలో 250 కేలరీలను ఖర్చుచేయవచ్చు. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చవటం అనేది జరుగుతుంది. కొంతమంది ఒక మైలుతో మొదలుపెట్టి రెండు నుండి నాలుగు మైళ్లవరకు వాకింగ్‌ చేస్తుంటారు.
  3. వాకింగ్‌ ఎలా చేయాలి..?: వాకింగ్‌ మొదలు ప్రారంభించగానే గంటలు గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. ఆ తర్వాత అరగంట, ఆపైన అరగంట నుంచి ముప్పావు గంటవరకు, తర్వాత గంటవరకు పెంచుతూ పోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి, మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజూ నడవటం వల్ల అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చవుతాయి. వాకింగ్‌ అప్పుడే మొదలుపెట్టినవారికి ఇది మంచి ఫలితం. అయితే ఒకసారి వాకింగ్‌ మొదలుపెట్టాక దాన్ని ఆపకుండా చేస్తుండటం మంచిది. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని చెబుతున్నారు.
  4. వాకింగ్‌ చేయడమే కాదు.. ఆహారం విషయంలో కూడా..: ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్‌ చేస్తుంటారు. వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా కఠిన మైన నియమాలు పెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. వాకింగ్‌ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కు వగా జంక్‌ ఫుడే అయి ఉంటుంది. ఇలాంటివారు ఎంతగా వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అయిపోతుంది. వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గాలనుకున్నా.. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి.
  5. బరువు తగ్గాలనుకునే వారు ఎంత సేపు నడవాలి..?: బరువు తగ్గాలనుకునే వారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్నకొద్ది రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండువారాలు నడిచి ఇంకా బరువు తగ్గటం లేదని నిరాశపడి వాకింగ్‌ చేయడం మానేస్తుంటారు. అలా చేయకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఒపికతో క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తుండాలి. తర్వాత ఫలితం ఉంటుంది.
  6. రివర్స్‌ నడవడం వల్ల..: వాకింగ్‌ చేసేవారు మలుపుల్లో నడిస్తే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డుమీద కాకుండా మలుపులు ఉన్న బాటలో నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయట. అలాగే ముందుకు కాకుండా వెనక్కు నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చట. వెనక్కు నడిస్తే మన గుండె వేగం మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో సాధారణ నడకతో కంటే ఈ రివర్స్‌ నడకతో గుండెకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుండి వాహనాలు రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడవవచ్చు.
  7. మధుమేహం.. గుండె జబ్బులున్నవారికి..: ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌ ఉన్న వారికి మరి మంచిది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. శరీరం హుషారుగా ఉండేటట్లు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్‌ చేసిన వారు చురుకుగా ఉంటారు.

(నోట్‌: అందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి:

Fitness Tips: మీరు జిమ్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తున్నారా..? ప్రమాదమే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

Watermelon: పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?