Diabetes: నో టెన్షన్.. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ పండ్లను తినవచ్చంటున్న వైద్య నిపుణులు
Diabetes: ప్రస్తుత కాలంలో డయాబెటిస్ ఎంతో మందిని వెంటాడుతోంది. అయితే షుగర్ వ్యాధిని శాశ్వతంగా వదిలించుకునేందుకు వీలు కాదు. కానీ.. జీవన శైలిలో మార్పుచేసుకుని అదుపులో..
Diabetes: ప్రస్తుత కాలంలో డయాబెటిస్ ఎంతో మందిని వెంటాడుతోంది. అయితే షుగర్ వ్యాధిని శాశ్వతంగా వదిలించుకునేందుకు వీలు కాదు. కానీ.. జీవన శైలిలో మార్పుచేసుకుని అదుపులో ఉంచుకోవడమే. ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయమం, ఇతర జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉంచుకోవచ్చు. తిండి విషయంలో నోరు కట్టడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లను తినాలన్నా ఎన్నో అపోహాలు ఉంటాయి. కానీ కొన్ని పండ్లు తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. పండ్లు తినడంలో అపోహాలు ఉన్నవారు ఈ విషయాలను తెలుసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటిస్ ఉన్నా కొన్నిపండ్లను నిరభ్యంతరంగా తినవచ్చని సూచిస్తున్నారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
1 / 9
యాపిల్: యాపిల్ పండు తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని భయపడుతుంటారు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. దీని జీఐ 38 మాత్రమే. కాబట్టి డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు యాపిల్‌ను తినవచ్చు. అయితే యాపిల్ పెద్ద సైజ్‌లో ఉంటే సగం తింటే చాలు.
2 / 9
బొప్పాయి: డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఎంతో మంచిది. ఇందులో హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా బొప్పాయిని తినడం మర్చిపోవద్దు.
3 / 9
జామ కాయ: డయాబెటిస్ ఉన్నవారికి జామ ఎంతో మంచిది. ఇది షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవారికి జామ మంచి ఔషధంగా చెప్పాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. జామకాయలో విటమిన్ ఏ, సీతో పాటు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
4 / 9
దానిమ్మ: దానిమ్మలో జీఐ 18గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఎంతో మంకిది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
5 / 9
నిమ్మకాయ: సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని చక్కెరస్థాయిలను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
6 / 9
కివీస్: విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కివీస్‌లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే కివీస్ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
7 / 9
రేగు పండ్లు: రేగు పండ్లు తినడం వల్ల కూడా డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో క్యాలరీలతో పాటు గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని కూడా షుగర్ వ్యాధిఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు.
8 / 9
ఆరెంజ్: ఆరెంజ్‌లో జీఐ తక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, ఈ, ల్యూటిన్, బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ రోగుల్లో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి.... (నోట్: అందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)