AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health with Apples: రోజూ యాపిల్ పండ్లను తింటే ఎన్ని లాభాలో.. కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల కలిగే సమస్యలు మీకు తెలుసా..?

మలబద్ధకం , అజీర్ణం, గ్లూకోజ్ లోపం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ ఆపిల్ అద్భుతమైన నివారణలా పనిచేస్తుంది. యాపిల్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వాటిని రెగ్యులర్‌గా  తినాలనుంకుంటారు..

Health with Apples: రోజూ యాపిల్ పండ్లను తింటే ఎన్ని లాభాలో.. కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల కలిగే సమస్యలు మీకు తెలుసా..?
Apple
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 04, 2022 | 12:41 PM

Share

మలబద్ధకం , అజీర్ణం, గ్లూకోజ్ లోపం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ యాపిల్ అద్భుతమైన నివారణలా పనిచేస్తుంది. యాపిల్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వాటిని రెగ్యులర్‌గా  తినాలనుంకుంటారు మీరు. ఎందుకంటే యాపిల్ అన్ని వేళల్లో లభ్యమయ్యే పండు, ఇంకా దాని ప్రయోజనాలు అనేకం. యాపిల్ పండులో కాస్త పులుపు, తీపి భాగం ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఈ పండును తినడం చాలా మంచిది. ఈ పండును ఖాళీ కడుపుతో తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అనేక రకాల పోషక గుణాలతో సమృద్ధిగా ఉన్న పండ్లలో యాపిల్ కూడా ఒకటి. కానీ యాపిల్‌ను తినే ముందు.. ఏయే సమయాలలో తినాలి అనేదాని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే యాపిల్ మానవ శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది, ఇంకా దీనిని ఏ వేళలో పడితే ఆ వేళలో తినకూడదు. అయితే యాపిల్‌ను తినడం ద్వారా బరువు పెరగవచ్చు. ఈ సంగతి మీకు తెలుసా..? దాని గురించి మనం తెలుసుకుందాం..

బరువు పెరగడానికి యాపిల్స్ కారణమా..?

మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను యాపిల్ దూరం చేస్తుంది. రోజూ ఉదయం ఒక యాపిల్ తింటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ప్రతిరోజూ యాపిల్ పండ్లను తింటూ ఉంటే చాలా తేలికగా బరువు పెరగవచ్చు. ఇంతే కాకుండా, పరిమిత పరిమాణంలో యాపిల్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర చక్కెర పదర్థాలతో పోలిస్తే యాపిల్‌లోని ఫ్రక్టోజ్ మిమ్మల్ని లావుగా చేస్తుంది. అయితే దీని గురించి ఎలాంటి సైంటిఫిక్ నిర్ధారణ లేదు.

తినడానికి సరైన సమయం..

ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడానికి సరైన సమయం. కడుపు సంబంధిత సమస్య అయినా, గుండె సంబంధిత సమస్య అయినా.. సరైన సమయంలో యాపిల్ తింటే అన్ని రోగాలను నయం చేస్తుంది. యాపిల్స్‌లోని పీచు మీ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నట్లయితే, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ శరీరంలోని గ్లూకోజ్ లోపాన్ని తీర్చడంలో యాపిల్‌లోని పోషకాలు చాలా సహాయపడతాయి. చాలా మంది మలబద్ధకం గురించి కూడా ఫిర్యాదు చేస్తారు. అయితే మీరు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తింటే, మలబద్ధకం సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..