Strawberry For Skin: మెరిసే, మచ్చలు లేని అందం కావాలా? అయితే, ఈ నేచురల్ ఫేస్‌ ప్యాక్ ట్రై చేయండి..!

Strawberry For Skin: స్ట్రాబెర్రీ చాలా టేస్టీ ఫ్రూట్. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, స్ట్రాబెర్రీ ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా

Strawberry For Skin: మెరిసే, మచ్చలు లేని అందం కావాలా? అయితే, ఈ నేచురల్ ఫేస్‌ ప్యాక్ ట్రై చేయండి..!
Beautytips
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 02, 2022 | 6:23 AM

Strawberry For Skin: స్ట్రాబెర్రీ చాలా టేస్టీ ఫ్రూట్. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, స్ట్రాబెర్రీ ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించి అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి మీ చర్మాన్ని సహజంగా ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి . ఇవి అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. మొటిమలు, చర్మం నిస్తేజాన్ని తొలగించడంలో అద్భుతంగా పని చేస్తాయి. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. మరి స్ట్రాబెర్రీ ఫేస్‌ ప్యాక్‌లో లాభాలేంటి? దానిని ఎలా తయారు చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్.. 4-5 తాజా స్ట్రాబెర్రీలను తీసుకోవాలి. వాటిని గుజ్జు చేసి పేస్ట్‌ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడకు అప్లై చేయాలి. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచినీటితో కడగాలి. వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రాబెర్రీ, పెరుగు ఫేస్ ప్యాక్ ఇంట్లో తయారీ విధానం.. 4-5 స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ పల్ప్ చేయడానికి బ్లెండర్లో వేయాలి. దానికి 1 టీస్పూన్ పెరుగు కలపాలి. పేస్ట్‌లా మంచిగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. వారానికి 1, 2 సార్లు చేస్తే ముఖం మెరుస్తుంది.

స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీమ్, హనీ ఫేస్ ప్యాక్.. కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకుని పేస్ట్‌లా చేయాలి. దానికి ఒక చెంచా తేనె, పాలు కలపాలి. బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేయాలి. మెల్లగా మసాజ్ చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి.

స్ట్రాబెర్రీ, నిమ్మకాయ ఫేస్ ప్యాక్.. 3-4 స్ట్రాబెర్రీలను తీసుకోవాలి. వాటిని గుజ్జుగా చేసి.. దానికి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

స్ట్రాబెర్రీ, తేనె ఫేస్ ప్యాక్.. కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

Also read:

Kolkata Knight Riders vs Punjab Kings: రస్సెల్ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. !

April Fool’s Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..