AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April Fool’s Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

April Fool's Day: నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఫైనాన్షియల్ పరంగా ఇది ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ తేదీ. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ ఫూల్స్ డే అంటారు.

April Fool's Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
April Fools Day
Shiva Prajapati
|

Updated on: Apr 01, 2022 | 10:28 PM

Share

April Fool’s Day: నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఫైనాన్షియల్ పరంగా ఇది ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ తేదీ. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ ఫూల్స్ డే అంటారు. ఈ రోజును తమ సన్నిహితులు, మిత్రులను ఏదో ఒక విషయంలో, సందర్భంలో ఫూల్స్‌ని చేస్తూ సరదాగా గడుపుతారు. చిన్న పిల్లలు అయితే మరీ ఎక్కువగా అల్లరి చేస్తారు. బాల్యంలో మీరు కూడా ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ చేసి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఏప్రిల్ 1వ తేదీనే ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుకున్న వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ ఫూల్స్ డే వెనుక కథ ఏమిటి? ఫూల్స్ డే ని ఏప్రిల్ 1వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు? ఈ పద్ధతి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దాని గురించి ఖచ్చితమైన సమాచారం పొందడం కష్టం కానీ.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కథనాలైతే ప్రచారంలో ఉన్నాయి. దాని మూలం గురించి తెలుసుకోవడం ఇప్పటికీ ఒక రహస్యం. కానీ ఏప్రిల్ ఫూల్స్ జరుపుకోవానికి సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగానే ఈ ఈ ఫూల్స్ డే ప్రారంభమైందని చెబుతారు.

1582లో జూలియన్ క్యాలెండర్‌కు ఎండ్ చెబుతూ.. గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అమల్లోకి తీసుకువచ్చింది ఫ్రాన్స్. పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రారంభించాడు. ఈ క్యాలెండర్‌లో నూతన సంవత్సరం జనవరి నుండి ప్రారంభమవుతుంది. దీనినే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. అంతకు ముందున్న జూలియన్ క్యాలెండర్‌లో కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 న ప్రారంభమవుతుంది. అయితే, పోప్ చార్లెస్ 9 గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టగా.. ప్రజలు ఆ మార్పు గుర్తించలేదు. ఎప్పటిలాగే కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ఇలా ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం జరుపుకునే వారిని ఫూల్స్‌గా పిలవడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి ఏప్రిల్ 1ను ఫూల్స్ డే గా ప్రాచుర్యంలోకి వచ్చింది.

1381 నాటి కథ ఇదీ.. ఏప్రిల్ ఫూల్స్ డే విషయంలో ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II కు సంబంధించి తమాషా ఉదంతం ఒకటి ప్రబలంగా ఉంది. రిచర్డ్ II, బొహేమియా రాణి అన్నే మార్చి 32, 1381న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త విన్న ప్రజలు చాలా సంతోషించారు. సంబరాలు చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం కోసం సిబ్బంది అన్ని సన్నాహాలు చేయడం ప్రారంభించారు. అయితే, మార్చి 31 వచ్చాక అసలు విషయాన్ని గ్రహించాడు రిచర్డ్ II. తాను మోసపోయానని గ్రహించాడు. ఎందుకంటే మార్చి 32 ఎప్పటికీ రాదు కదా మరి!. అప్పటి నుండి, మార్చి 31 మరుసటి రోజు.. అంటే ఏప్రిల్ 1 న ఫూల్స్ డే జరుపుకుంటారు.

Also read:

Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..

Hyderabad: అతనికి ‘కల’ వచ్చిందంటే ఖతమే.. ఫుట్‌పాత్‌పై ఉంటూ కోట్లు కూడబెట్టిన దొంగ..!

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!