AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: ఈ ఆహారాలు పదే పదే తింటున్నారా.. క్యాల్షియం లోపిస్తుందన్న విషయం మీకు తెలుసా!

మన శరీరం మొత్తం ఆధార పడి పని చేసేది ఎముకలపైనే. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏ పని అయినా త్వరగా చేయగలం. లేదంటే ఇక అంతే సంగతులు. కండరాలను రక్షణగా బాడీకి స్థిరమైన ఆకారాన్ని కల్పించేవి బోన్స్. మనం తేలికగా కదలడానికి, యాక్టీవ్ గా ఉండటానికి హెల్ప్ చేసేవి ఎముకలే. అంతే కాకుండా ఎముకల్లో ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. ఇవి రక్తం తయారీకి సహాయ పడతాయి. ఇలా ఎముకలపైనే శరీరం మొత్తం ఆధార పడి ఉంటుంది. శరీరం బలంగా, దృఢంగా లేకపోతే ఎలాంటి పనులు చేయలేం. బోన్స్ స్ట్రాంగ్ ఉండేందుకు..

Health Care: ఈ ఆహారాలు పదే పదే తింటున్నారా.. క్యాల్షియం లోపిస్తుందన్న విషయం మీకు తెలుసా!
Calcium
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 15, 2023 | 10:25 PM

Share

మన శరీరం మొత్తం ఆధార పడి పని చేసేది ఎముకలపైనే. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏ పని అయినా త్వరగా చేయగలం. లేదంటే ఇక అంతే సంగతులు. కండరాలను రక్షణగా బాడీకి స్థిరమైన ఆకారాన్ని కల్పించేవి బోన్స్. మనం తేలికగా కదలడానికి, యాక్టీవ్ గా ఉండటానికి హెల్ప్ చేసేవి ఎముకలే. అంతే కాకుండా ఎముకల్లో ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. ఇవి రక్తం తయారీకి సహాయ పడతాయి. ఇలా ఎముకలపైనే శరీరం మొత్తం ఆధార పడి ఉంటుంది. శరీరం బలంగా, దృఢంగా లేకపోతే ఎలాంటి పనులు చేయలేం. బోన్స్ స్ట్రాంగ్ ఉండేందుకు ముఖ్య కారణం క్యాల్షయం.

శరీరం దానంతట అది క్యాల్షియం తాయారు చేసుకోలేదు. ఆహారం, సప్లిమెంట్స్ ద్వారానే క్యాల్షియం వెళ్తుంది. మనం సరిగ్గా క్యాల్షయం రిచ్ ఫుడ్స్ తీసుకోక పోతే.. క్యాల్షియం లోపం తలెత్తే అవకాశం ఉంది. ఇది ఎముకలపై బాగా ప్రభావం చూపిస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, బోన్స్ పెయిన్స్ అనేవి వస్తాయి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే.. క్యాల్షయం శోషణకు అడ్డు పడతాయి. దీంతో శరీరం క్యాల్షియంను గ్రహించ లేవు. ఈ కారణంగా ఎముకలకు సంబంధించి రక రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హై ప్రోటీన్ ఫుడ్స్:

ఇవి కూడా చదవండి

ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యంగా. కానీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం.. ఎముకలకు హాని జరుగుతుంది. ఎందుకంటే బాడీలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా తయావుతాయి. కాబట్టి మీ ఆహారంలో ప్రోటీన్స్, క్యాల్షియం రెండూ సమపాలల్లో తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.

ఉప్పు:

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తలెత్తే అవకాశం ఉంది. ఉప్పులో ఉండే సోడియం.. క్యాల్షియాన్ని క్షీణించేలా చేస్తుంది. దీంతో ఎముకలు గుల్ల బారి పోయి.. బలహీనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోండి.

కొన్ని రకాల కూరగాయాలు:

బచ్చలి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇందులో ఆక్సలేట్ అనేది అధికంగా ఉంటుంది. వీటిలోనే కాకుండా బీన్స్, కొన్ని రకాల చిక్కుళ్లు, దుంపల్లో కూడా ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఎముకలకు చాలా మంచిది. అలాగే టమాటా, వంకాయ, బంగాళ దుంపలు, పుట్ట గొడుగులు, మిరియాలు వంటివి ఎక్కువగా తీసుకుంటే బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది.

కెఫిన్:

సాధారణంగా ఇది కొంతమేర ఆరోగ్యం అయినప్పటికీ.. కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం క్యాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారతాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.