AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paracetamol Side Effects: తరచుగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా.. ఎంత డేంజరో తెలుసా!

శరీరంలో రోగ నిరోధక శక్తి వీక్ అయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సీజన్లు మారినప్పుడల్లా కూడా జ్వరం అనేది కామన్ గా ఎవ్వరికైనా వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా చాలా మంది వెంటనే పారాసిటమాటల్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ వల్ల కేవంల జ్వరం మాత్రమే కాకుండా ఫ్లూ, తల నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉన్నా కాస్త తగ్గుతాయి. జ్వరం, తల నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరకు వెళ్లినా పారాసిటమాలే ఇస్తారు. ఈ విషయం తెలిసిన చాలా మంది.. వైద్యుల్ని సంప్రదించకుండానే..

Paracetamol Side Effects: తరచుగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా.. ఎంత డేంజరో తెలుసా!
Paracetamol
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 11:40 AM

Share

శరీరంలో రోగ నిరోధక శక్తి వీక్ అయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సీజన్లు మారినప్పుడల్లా కూడా జ్వరం అనేది కామన్ గా ఎవ్వరికైనా వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా చాలా మంది వెంటనే పారాసిటమాటల్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ వల్ల కేవంల జ్వరం మాత్రమే కాకుండా ఫ్లూ, తల నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉన్నా కాస్త తగ్గుతాయి. జ్వరం, తల నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరకు వెళ్లినా పారాసిటమాలే ఇస్తారు. ఈ విషయం తెలిసిన చాలా మంది.. వైద్యుల్ని సంప్రదించకుండానే.. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వేసేసుకుంటారు.

కానీ ఇలా డాక్టర్ని సంప్రదించకుండా.. డోసేజ్ ఏంటో తెలీకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. అంతే కాకుండా శరీరంలోని అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో, పారాసిటమాల్ మాత్రలు ఎందుకు ఎక్కువగా వేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త హీనత:

ఇవి కూడా చదవండి

పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది తగ్గి పోతుందట. దీంతో రక్త హీనతకు దారి తీస్తుంది. అంతే కాకుండా బలహీనమవుతారని నిపుణులు చెబుతున్నారు.

కాలేయం దెబ్బతింటుంది:

చాలా మంది చేసే తప్పులు ఏంటంటే.. కేవలం పారాసిటమాలే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే మాత్రలు అనేవి వేసుకుంటున్నారు. దీని వల్ల ముఖ్యంగా లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని చాలా మందికి తెలీదు. కాలేయం దెబ్బతింటే కళ్లు, చర్మం అనేది పసుపు రంగులోకి మారి పోతాయి. మూత్రం కూడా పసుపు రంగులో మారుతుంది. కాబట్టి ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి.

అలర్జీ:

పారాసిటమాల్ మాత్రలను ఎక్కువగా తీసుకున్నా.. కొందరిలో అలర్జీకి దారి తీస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోలేక పోవడం లక్షణాలు కనిపిస్తాయి.

రక్త స్రావము:

పారాసిటమాల్ మాత్రలు వేసుకోవడం వల్ల కొందరిలో తీవ్రంగా రక్త స్రావం కూడా అవుతుంది. అంతే కాకుండా ఈ ట్యాబ్లెట్ ను ఆస్పిరిన్ వంటి ఇతర మందులతో కలిపి తీసుకుంటే మాత్రం రక్త స్రావము అనేది మరింత ఎక్కువగా అవుతుంది. అంతే కాకుండా ఆకలి లేక పోవడం, చెమట ఎక్కువగా పట్టడం, వాంతులు, వికారం, తిమ్మిరి, పొత్తి కడుపు పై భాగంలో నొప్పి వంటివి కూడా ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
రామాయణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్
రామాయణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్
ఓటీటీలో పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది..