AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digestive Drinks: అజీర్తితో బాధపడుతున్నారా? సహజ పద్ధతులో పొట్టను ఇలా శుభ్రం చేయండి

ప్రతి ఒక్కరూ ఇష్టమైన వాటిని తినడం, త్రాగడం చేస్తుంటారు. చేపలు, మాంసం, మటన్, జున్ను ఇలా దేనినీ మినహాయించకుండా అన్నింటినీ ఆరగిస్తుంటారు. అలాగే పోలావ్ నుంచి బిర్యానీ వరకు అన్నీ లాగించేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి పార్టీలలో అయితే ఒక్కోసారి అన్‌లిమిటెడ్‌గా తింటుంటారు. అయితే తిన్న తర్వాత ఎసిడిటీ ప్రారంభమవుతుంది. ఆహారం సరిగ్గా అరగక పోవడం వల్ల ఈ సమస్య..

Srilakshmi C
|

Updated on: Nov 15, 2023 | 8:21 PM

Share
ప్రతి ఒక్కరూ ఇష్టమైన వాటిని తినడం, త్రాగడం చేస్తుంటారు. చేపలు, మాంసం, మటన్, జున్ను ఇలా దేనినీ మినహాయించకుండా అన్నింటినీ ఆరగిస్తుంటారు. అలాగే పోలావ్ నుంచి బిర్యానీ వరకు అన్నీ లాగించేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి పార్టీలలో అయితే ఒక్కోసారి అన్‌లిమిటెడ్‌గా తింటుంటారు. అయితే తిన్న తర్వాత ఎసిడిటీ ప్రారంభమవుతుంది. ఆహారం సరిగ్గా అరగక పోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మరైతే ఏం చెయ్యాలి.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు.

1 / 5
ఉదయం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఒకటిన్నర గ్లాసుల నీళ్లలో చెంచా సోంపు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి, దానిలో కొంచెం తేనె కలిపి తాగాలి. ఈ పానీయం జీర్ణసంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
ఒక గ్లాసు నీటిని మరిగించి, అందులో కొన్ని పుదీనా ఆకులు, దంచిన అల్లం ముక్క ఒకటి వేయండి. బాగా మరిగించిన తర్వాత నీళ్లను ఒడగట్టి తాగాలి. ఇది అజీర్తి సమస్యను పారదోలడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3 / 5
ఉదయాన్నే చియా సీడ్ నీళ్లు తాగితే అల్పాహారం అవసరం ఉండదు. రెండు చెంచాల చియా గింజలను రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్, 2 చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
ఒక పెద్ద చెంచా కొత్తిమీర తురుమును ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించాలి. వడకట్టిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. ఈ పానియం తాగితే శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలాగే ఉదయాన్నే పుష్కలంగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అతిగా తినడానికి బదులుగా తక్కువ తినడానికి ప్రయత్నించండి.

5 / 5