- Telugu News Photo Gallery Follow these tips to reduce phlegm during cold season, check here is details in Telugu
Clove Tea for Phlegm: చలి కాలంలో కఫం బాగా పట్టేసిందా.. ఈ టీతో చెక్ పెట్టొచ్చు!
సాధారణంగా చలి కాలంలో జలుబు అనేది ఎక్కువగా చేస్తుంది. అలాగే పొగ మంచు కారణంగా దగ్గు, ముక్కు దిబ్బడ కూడా చేస్తుంది. అందులోనూ ఉబసం ఉన్న వారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది. దీంతో తినేందుకు, తాగేందుకు, దగ్గడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కఫాన్ని పోగొట్టడంలో లవంగాలు బాగా పని చేస్తాయి. చలి కాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగా బాగా సహాయ పడతాయి. మందులు ఎన్ని మింగినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 15, 2023 | 10:24 PM

సాధారణంగా చలి కాలంలో జలుబు అనేది ఎక్కువగా చేస్తుంది. అలాగే పొగ మంచు కారణంగా దగ్గు, ముక్కు దిబ్బడ కూడా చేస్తుంది. అందులోనూ ఉబసం ఉన్న వారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది. దీంతో తినేందుకు, తాగేందుకు, దగ్గడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కఫాన్ని పోగొట్టడంలో లవంగాలు బాగా పని చేస్తాయి.

చలి కాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగా బాగా సహాయ పడతాయి. మందులు ఎన్ని మింగినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో లవంగాలను.. అనారోగ్య సమస్యల్ని తగ్గించే ఔషధంలా ఉపయోగిస్తారు. లవంగాలతో తయారు చేసిన టీ తాగడం వలన కఫాన్ని తగ్గించుకోవచ్చు.

ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరింగాలి. ఇప్పుడు చిన్న అల్లం, దాల్చిన ముక్క వేసి, ఓ మూడు లవంగాలు వేసి బాగా మరిగించు కోవాలి. ఇవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి, వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని, అందులో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి.

ఈ టీకి కఫాన్ని విరిచే శక్తి ఉంది. దీన్ని తాగడం వల్ల కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ లవంగాల టీలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జలుబు, దగ్గు, జ్వరం అనేవి తగ్గుతాయి.

సైనస్ తో బాధ పడేవారు కూడా లవంగాల టీని తరచూ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఈ లవంగాల టీ తాగినప్పుడు.. కాకర కాయలతో చేసిన వంటకాలు ఎక్కువగా తినాలి. ఎందుకంటే కాకర కాయలకు కూడా కఫాన్ని విరిచే శక్తి ఉంది. ఈ లవంగాల టీ తాగడం వల్ల వికారం, అజీర్తి, వికారం, వాంతులు వంటివి కూడా రాకుండా ఉంటాయి.





























