- Telugu News Photo Gallery Cinema photos Former Pakistani cricketer Abdul Razzaq who made controversial comments if I had married Aishwarya Rai Photos Telugu Entertainment Photos
Abdul Razzaq – Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ని నేను పెళ్లి చేసుకొని ఉంటే.. పాక్ మాజీ క్రికెటర్ సెన్సేషన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌పై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఓపెన్ డిబేట్‌లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే అంటూ హద్దులు దాటాడు.
Updated on: Nov 16, 2023 | 4:41 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌పై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఓపెన్ డిబేట్‌లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే అంటూ హద్దులు దాటాడు.

ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. రజాక్ నోటి వెంట ఒక్కసారిగా ఐశ్వర్య రాయ్ పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం.

రజాక్‌తో పాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక స్త్రీ పట్ల ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

అంతేకాదు తోటి మాజీ క్రికెటర్లు సైతం అతడిని తప్పుపట్టడంతో చివరికి క్షమాపణలు చెప్పాడు. క్రికెట్ కోచింగ్, దాని ఉద్దేశాలను గురించి మాట్లాడాల్సిన సమయంలో.. నోరుజారి ఐశ్వర్యారాయ్ పేరును ప్రస్తావించాను, ఆమెకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను.

ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు అంటూ పాక్‌లోని స్థానిక మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు. అతడితోపాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్- 2023 జరుగుతుంది. ఇందులో భాగంగా నవంబరు 15న సెమీస్‌లో భారత్ Vs న్యూజిలాండ్ మధ్య పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదుచేసిన పాకిస్తాన్ ఇంటిముఖం పట్టింది.

ఈ వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాక్ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ ఓటములను పాక్ అభిమానులతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారంటున్నారు.





























