- Telugu News Photo Gallery Cinema photos Actress Deepika Padukone reacts on Koffee with karan show trolls telugu cinema news
Deepika Padukone: ‘రణవీర్ నా మనసుకు దగ్గరయ్యారు’.. ‘కాఫీ విత్ కరణ్ ‘ షో విమర్శలపై స్పందించిన దీపికా..
ఇటీవల బాలీవుడ్ స్టార్ కపూల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ వైవాహిక జీవితం గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ జంట కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొని సందడి చేసింది. అయితే ఈ షోలో రిలేషన్స్ పై దీపికా చేసిన కొన్ని కామెంట్స్ పై నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు కురిపించారు. అంతేకాకుండా రణ్వీర్, దీపికా వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు వచ్చాయి. తాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తను దేనికీ భయపడనని అన్నారు.
Updated on: Nov 15, 2023 | 9:53 PM

ఇటీవల బాలీవుడ్ స్టార్ కపూల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ వైవాహిక జీవితం గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ జంట కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొని సందడి చేసింది.

అయితే ఈ షోలో రిలేషన్స్ పై దీపికా చేసిన కొన్ని కామెంట్స్ పై నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు కురిపించారు. అంతేకాకుండా రణ్వీర్, దీపికా వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు వచ్చాయి. తాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తను దేనికీ భయపడనని అన్నారు.

దీపికా మాట్లాడుతూ. "నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించే మాట్లాడతాను. నిజాన్ని నిర్భయంగా చెబుతాను. తప్పును ఖండించడానికి కూడా వెనకాడను. చిన్నతనం నుంచి అలాగే పెరిగాను. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే క్షమాపణలు అడగడానికి భయపడను. ప్రతి విషయాన్ని ఎన్నో కోణాల్లో ఆలోచిస్తాను" అని అన్నారు.

కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో దీపికా మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల లైఫ్ అంతా నేను సింగిల్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే ఆ తర్వాత చాలా మందితో వృత్తిపరంగా చనువుగా ఉన్నప్పటికీ రణ్వీర్ మాత్రమే నా మనసుకు దగ్గరయ్యారు. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకుని అతడితో జీవితం పంచుకోవాలనుకున్నాను. అని చెప్పారు.

కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో దీపికా మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల లైఫ్ అంతా నేను సింగిల్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే ఆ తర్వాత చాలా మందితో వృత్తిపరంగా చనువుగా ఉన్నప్పటికీ రణ్వీర్ మాత్రమే నా మనసుకు దగ్గరయ్యారు. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకుని అతడితో జీవితం పంచుకోవాలనుకున్నాను. అని చెప్పారు.




