- Telugu News Photo Gallery Cinema photos Rangam heroine Karthika Nair introduced her future husband Photos Telugu Actress Photos
karthika nair: కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్.. రాధ కూతురుగా ఎంట్రీ.
సీనియర్ నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు కార్తిక నాయర్. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె..
Updated on: Nov 15, 2023 | 9:48 PM

సీనియర్ నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అభిమానుల మనసు గెలుచుకున్నారు కార్తిక నాయర్.

దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె.. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్‌ను పరిచయం చేశారు.

తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె.. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్‌ను పరిచయం చేశారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2009లో తెరకెక్కిన ‘జోష్’తో కార్తిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

2011లో విడుదలైన రంగంతో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. 2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటున్నారు.




