ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే స్పెషల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే శరరీంలో జరిగే అద్భుతాలు ఇవే..
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మొక్కల్లో తిప్పతీగ (గుడుచి) ఒకటి. జలుబు, దగ్గు, కఫం, ఇన్ఫ్లమేషన్ వంటి సీజనల్ సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో ఈ కషాయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగలో ఉండే శక్తివంతమైన సహజ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, వైరస్‌లు, బాక్టీరియాలతో పోరాడే శక్తిని పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Benefits of giloy: ప్రకృతిలో ఎన్నో రకాల సహజ సిద్ధమైన ఔషధ మొక్కలు ఉన్నాయి.. అలాంటి వాటి గురించి చాలా మందికి తెలియదు.. అయితే.. ప్రకృతి ప్రసాదించిన మొక్కల గురించి తెలుసుకుంటే ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి పవర్‌ఫుల్ మొక్కల్లో తిప్పతీగ ఒకటి.. వాస్తవానికి సీజనల్ మార్పులు, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తరచుగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలలో జలుబు, దగ్గు, కఫం, శ్లేష్మాలు, ఇతర ఇన్ఫ్లమేషన్లు .. పలు సమస్యలు ఉంటాయి.. ముఖ్యంగా అన్ని సీజన్లలో, వర్షాలు కురిసేటప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఇన్ఫ్లమేషన్ల నుండి రక్షణ కల్పించి, శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తిప్పతీగ (గుడుచి) కషాయం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
తిప్పతీగ కషాయం మూడు ప్రధాన మార్గాలలో రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది:
1. క్రిములను నాశనం చేయడంలో సహాయం: చల్లని వాతావరణంలో శరీరంలోకి బాక్టీరియా – వైరస్‌లు సులభంగా ప్రవేశిస్తాయి. తిప్పతీగలోని 15 రకాల ఆల్కలాయిడ్స్, 6 రకాల గ్లైకోసైడ్స్ రక్తంలో గస్తీ కాసే మాక్రోఫేజ్ కణాలను శక్తివంతం చేస్తాయి. ఈ మాక్రోఫేజ్ కణాలలోని లైసోజోమ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా, వైరస్‌లు, బాక్టీరియాలు వేగంగా నాశనం అవుతాయి. లైసోజోమ్‌లు క్రిములను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, వాటిని భస్మం చేస్తాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
2. ఇన్ఫ్లమేషన్‌ను నియంత్రించడం: సీజనల్ మార్పుల వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ విడుదల చేసేవి శ్లేష్మం, కఫం వంటి వాటికి కారణమవుతాయి. తిప్పతీగలోని 16 రకాల ఆల్కలాయిడ్స్, 6 రకాల గ్లైకోసైడ్స్ ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్‌ను నాశనం చేసి, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. తద్వారా, జలుబు, దగ్గు, కఫం వంటి లక్షణాలు తగ్గుతాయి.
3. యాంటీబాడీల ఉత్పత్తిని పెంచడం: వైరస్‌లు, బాక్టీరియాలు శరీరంపై దాడి చేసినప్పుడు, తిప్పతీగ కషాయం వాటిని నాశనం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షించే యాంటీబాడీల ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఇది B సెల్స్ – T హెల్పర్ సెల్స్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది. B సెల్స్ వైరస్‌లకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేస్తాయి. ఈ కణాల పెరుగుదల వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత చురుకుగా పనిచేస్తుంది. తద్వారా శరీరం ఎక్కువ కాలం వ్యాధి రహితంగా ఉంటుంది.
తిప్పతీగ కషాయం తయారీ – వాడకం:
పల్లెటూర్లలో తాజా తిప్పతీగ ఆకులు సులభంగా లభిస్తాయి. 10-20 ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, వడకట్టి, తేనె కలుపుకుని తాగవచ్చు. నగరాలలో నివసించే వారు తిప్పతీగ పొడిని ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ తిప్పతీగ పొడి వేసి, అది అర గ్లాసు అయ్యేవరకూ మరిగించి, వడకట్టి, తేనె కలుపుకుని తాగాలి. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు కూడా తేనెతో కలిపి ఈ కషాయాన్ని తీసుకోవచ్చు.
అయితే.. తిప్పతీగ కషాయాన్ని చాలామంది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇప్పటికే.. దాని సామర్థ్యం గురించి అన్నో అధ్యయనాలు వివరించాయి. సాధారణ బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు లేదా సీజనల్ మార్పుల వల్ల శరీరం బలహీనపడినప్పుడు తిప్పతీగ కషాయం తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా 10-15 రోజులు తాగడం వల్ల కొన్ని నెలల పాటు రోగనిరోధక శక్తి చురుకుగా ఉండి, ఇన్ఫ్లమేషన్, అనారోగ్యాల నుండి రక్షణ లభిస్తుంది.
నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..
చిన్న సీక్రెట్ మేడమ్.. ఇదొక్కటి చేస్తే.. మల్లెలు గుత్తులు గుత్తులుగా పూస్తాయ్..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
