Mohammed Shami: వన్డే ప్రపంచకప్‌లో షమీ సరికొత్త చరిత్ర.. దెబ్బకు జహీర్ రికార్డ్ బ్రేక్..
షమీ తన తొలి బంతికే ఆరో ఓవర్‌లో డెవాన్ కాన్వే (13 పరుగులు) వికెట్‌ను తీశాడు. అలాగే 8వ ఓవర్లో రచిన్ రవీంద్ర (13 పరుగులు)ను అవుట్ చేయడం ద్వారా కివీస్ పై ఒత్తిడి పెంచాడు. అతను 33వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (69 పరుగులు)ను అవుట్ చేయడం ద్వారా డారిల్ మిచెల్‌తో సెంచరీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ 7 వికెట్లు తీశాడు.