Oats Benefits: ప్రతి రోజూ ఓట్స్ తింటే నిజంగానే అన్ని లాభాలు ఉంటాయా!

| Edited By: Ravi Kiran

Nov 08, 2023 | 8:41 PM

ఓట్స్.. వీటి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. ఓట్స్ లో చాలా పోషకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఓట్స్ తో ఎలాంటి ఆహారాన్ని అయినా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఓట్స్ ని తమ ఆహారలో భాగం చేసుకుంటున్నారు. ఓట్స్ తో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మరి ఓట్స్ ని ఎలా, ఎప్పుడు తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఓట్స్ ని ఏదో ఒక రూపంలో..

Oats Benefits: ప్రతి రోజూ ఓట్స్ తింటే నిజంగానే అన్ని లాభాలు ఉంటాయా!
Oats Health
Follow us on

ఓట్స్.. వీటి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. ఓట్స్ లో చాలా పోషకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఓట్స్ తో ఎలాంటి ఆహారాన్ని అయినా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఓట్స్ ని తమ ఆహారలో భాగం చేసుకుంటున్నారు. ఓట్స్ తో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మరి ఓట్స్ ని ఎలా, ఎప్పుడు తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఓట్స్ ని ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అందుతాయి.

ఓట్స్ లోని పోషకాలు:

ఓట్స్ లో పీచు పదార్థం, విటమిన్లు బి-1, బి-2, సి కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు, ప్రోటీన్స్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఉదయం – రాత్రి తీసుకోవచ్చు:

ఓట్స్ ని సరిగ్గా తీసుకుంటే అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఓట్స్ తో ఒక్కటేంటి.. అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బీపీ, మధు మేహంతో బాధ పడేవారు ఓట్స్ ని ఉదయం, రాత్రి బ్రేక్ ఫాస్ట్ లా తీసుకోవచ్చు. దీని వల్ల రక్త పోటు, షుగర్ అదుపులోకి వస్తుంది. మధ్యాహ్నం ఓట్స్ తీసుకోకపోవడమే మంచిది. అలాగే జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఓట్స్ లో ఉండే ఫైబర్ గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.

బాడీ ఫిట్ గా ఉండాలనుకునే వారికి బెస్ట్:

బరువు తగ్గాలనుకునే వారు సైతం ఓట్స్ తో డైట్ ని ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజూ ఓట్స్ ని ఉదయం లేదా రాత్రి బ్రేక్ ఫాస్ట్ లో యాడ్ చేసుకుని తింటే హ్యీపీగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఉండే పోషకాలు బాడీని ఫిట్ గా ఉండేలా చేస్తాయి. శరీరంలో ఫ్యాట్ ని కూడా కరిగించేస్తుంది. అంతే కాదు ఓట్స్ తో క్యాన్సర్, ఆస్తమా, చర్మ సమస్యలు కూడా దరి చేరకుండా చూస్తుంది. అంతే కాకుండా నీరసాన్ని కూడా దరి చేరదు. కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.

ఓట్స్ లో ఎన్నో రకాలు:

అయితే ఓట్స్ లో అనేక రకాలు ఉన్నాయి. మన బాడీకి తగ్గట్టుగా, ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటికి తగిన విధంగా ఓట్స్ ని తీసుకోవాలి. అవసరం అయితే న్యూట్రీషియన్ హెల్ప్ తీసుకోవచ్చు. వారు చెప్పిన ప్రకారం మంచి డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.