AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ నోరు తరచుగా పొడిబారుతోందా? ఈ 6 ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతాలు కావొచ్చు..

ఏదైనా వ్యాధి సమయానికి ముందే గుర్తించాని మీరు కోరుకుంటే, దాని కోసం మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యునికి చూపించుకోవాల్సి ఉంటుంది.

Health Tips: మీ నోరు తరచుగా పొడిబారుతోందా? ఈ 6 ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతాలు కావొచ్చు..
Drinking Water
Venkata Chari
|

Updated on: May 11, 2022 | 9:02 PM

Share

ఏదైనా వ్యాధి వచ్చేముందు లేదా వచ్చినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు మన శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయనే సంగతి తెలిసిందే. చాలా సార్లు శరీరం మనకు కొన్ని పెద్ద వ్యాధుల సంకేతాలను ఇస్తుంది. కానీ, ప్రజలు వాటిని సాధారణమైనవిగా భావించి వాటిని విస్మరిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి ఉంటాయని తెలిసిందే. మన శరీరంలోని ఏదైనా భాగంలో సమస్య ఏర్పడినప్పుడు, దాని సంకేతాలు(Symptoms) ఇతర ప్రదేశాలలో కనిపించడం ప్రారంభిస్తాయి. నోటి(Mouth Health) ఆరోగ్యం బలహీనంగా ఉంటే, అది శరీరంలో సంభవించే కొన్ని తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. నోరు తరచుగా పొడిబారడం(dry mouth) అనేది శరీరంలోకి ఏదో సరిగ్గా జరగడం లేదని సంకేతంగా గుర్తించాలి.

Also Read: Heart Attack: గుండెపోటుకు శాశ్వత నివారణ ఇదే.. అమెరికన్ శాస్త్రవేత్తల కీలక ప్రకటన.. ఖర్చు ఎంతంటే?

మీ నోరు చాలా పొడిగా మారినట్లయితే, అది స్ట్రోక్, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ సంకేతం కావొచ్చు. కొన్నిసార్లు నోరు పొడిబారడం అనే లక్షణం HIV లేదా స్జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి స్వయం ప్రతిరక్షక రుగ్మతకు కూడా సంకేతం కావచ్చని డాక్టర్లు అంటున్నారు.

డ్రై మౌత్ ఉంటే ఈ వ్యాధులకు సంకేతాలు కావొచ్చు..

ఇవి కూడా చదవండి

– డయాబెటిస్

– స్ట్రోక్

– HIV

– అల్జీమర్స్

– స్జోగ్రెన్స్ సిండ్రోమ్

– నరాల బలహీనత

జిరోస్టోమియా (నోరు పొడిబారడం) అనేది లాలాజల గ్రంథులు నోటి తేమను నిర్వహించడానికి తగినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయని పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. నోటి ఆరోగ్యంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే యాసిడ్‌ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది.

పొడి నోటి లక్షణాలు..

– నోటి లోపల పొడిగా ఉండడం లేదా జిగటగా ఉండడం

– చిక్కటి లాలాజలం

– నోటి దుర్వాసన

– నమలడం, మాట్లాడటం, మింగడంలో ఇబ్బంది

– గొంతులో పుండ్లు లేదా పొడిబారడం

– నాలుక పొడిబారడం

– రుచిలో మార్పు

ఏదైనా వ్యాధి సమయానికి ముందే గుర్తించాని మీరు కోరుకుంటే, దాని కోసం మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యునికి చూపించుకోవాల్సి ఉంటుంది. ఇది మీ నోటి పరిశుభ్రతకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. దీని కారణంగా నోటిలో ఏదైనా సమస్య తీవ్రతరం కావడానికి ముందే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Spinach Benefits: రక్తహీనత వేధిస్తుందా.. అయితే బచ్చలి కూరతో ఈ సమస్యకు చెక్‌ పెట్టండి..

Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నారా ?.. అయితే ఈ పద్ధతులను పాటిస్తే క్షణాల్లో ఉపశమనం..