ఎక్కువగా ఆ సమస్య మహిళల్లోనే.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించొద్దు..
మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది.. గర్భిణీలు, బహిష్టు స్త్రీలలో ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి అవగాహనతో ఉండటం వల్ల.. కొన్ని జాగ్రత్తలతో బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత లక్షణాలు.. సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి..

ఉరుకుపరుగుల జీవితం.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం ఉత్తమం.. అయితే.. ప్రస్తుత కాలంలో చాలామందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది.. రక్తహీనత అనేది శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ లోపం ఉన్న పరిస్థితి.. దీనిని సాధారణంగా శరీరంలో రక్తం లేకపోవడం అని కూడా పిలుస్తారు. రక్తహీనత సమస్య ఎక్కువగా మహిళలు, పిల్లలలో ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన ఆహారంలో ఐరన్ (ఇనుము) లోపం ఉన్నప్పుడు, రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణలు చెబుతున్నారు. మన జీవనశైలి, తీసుకునే ఆహారం గురించి అవగాహన లేకపోవడం కూడా దీనికి ముఖ్యమైన కారణాలంటున్నారు.. ఐరన్ లోపం వల్ల అలసట, ఏకాగ్రత తగ్గడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి..
మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది.. గర్భిణీలు, బహిష్టు స్త్రీలలో ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి అవగాహనతో ఉండటం వల్ల.. కొన్ని జాగ్రత్తలతో బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనతకు ఇదే కారణం
ఆహారం తీసుకున్న వెంటనే టీ తాగడం కూడా మానేయాలని వైద్యులు అంటున్నారు.. ఎందుకంటే ఇది శరీరంలో ఆహారంలో ఉండే ఐరన్ శోషణను తగ్గిస్తుంది. ఇలాంటి అలవాట్ల వల్ల రక్తహీనత వ్యాధి వస్తుంది.
పాలు ఎక్కువగా తాపించడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.
కొన్ని రాష్ట్రాల్లో పిల్లలకు పాలు ఎక్కువగా తాపిస్తున్నారని.. శరీరంలో ఐరన్ లోపానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమని వైద్యులు చెబుతున్నారు.
రక్తహీనత లక్షణాలు ఇవే..
రక్తహీనత లక్షణాలను పరిశీలిస్తే.. తరచూ కోపం వస్తుండటం, అలసిపోవడం, చిరాకు ఉండటం.. తలనొప్పి, నిద్ర రావడం, వెన్ను నొప్పి, నడుము నొప్పి, విశ్రాంతి లేకపోవడం మొదలైనవి.. రక్తహీనత వ్యాధిలో కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.
ఐరన్ లోపాన్ని ఎలా అధిగమించాలి?
ఐరన్ లోపాన్ని అధిగమించడానికి వైద్యుల సలహా మేరకు ఐరన్ మాత్రలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, 25 శాతం మంది మహిళలు ఐరన్ మాత్రలకు రక్తహీనత సమస్య తగ్గదు.. కాబట్టి వారికి IV ఐరన్ ఇస్తారు. అలాగే, మనం సాంప్రదాయ వంట పద్ధతులను ఉపయోగించి.. ఈ సమస్యను అధిగమించవచ్చు..
పిల్లలలో రక్తహీనత..
దీనితో పాటు, రక్తహీనత కారణంగా పిల్లలలో చిరాకు, కోపం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా సానుకూల ఫలితాలను చూపుతుంది.
ఐరన్ లోపాన్ని అధిగమించడానికి మార్గాలు:
ఐరన్ లోపాన్ని అధిగమించడానికి అనేక సులభమైన చర్యలు తీసుకోవచ్చు. ఆహారంలో ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పాలకూర, బీన్స్, కాయధాన్యాలు, గింజలు , విత్తనాలు వంటివి.. ఐరన్ కు అద్భుతమైన వనరులు.. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఐరన్ సప్లిమెంట్లు కూడా లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. విటమిన్ సి సప్లిమెంట్లు ఇనుము శోషణను మెరుగుపరుస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా ఈ సమస్యను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా ఉంటాయి. రోజువారీ వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ, తగినంత నిద్ర ఐరన్ లోపాన్ని అధిగమించడానికి దోహదం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..